Site icon HashtagU Telugu

Rashmika Mandanna | ‘మనం కొట్టినం’.. ‘కింగ్‌డమ్’ స‌క్సెస్‌పై ర‌ష్మిక మంద‌న్నా పోస్ట్

Vijay Rashmika

Vijay Rashmika

Rashmika Mandanna: విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన “కింగ్‌డ‌మ్” చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. చాలా రోజుల త‌ర్వాత విజయ్ దేవ‌రకొండ‌కు “కింగ్‌డమ్” రూపంలో మంచి హిట్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తుంది. ఈ సినిమా, ఎలాగైన హిట్టు కొట్టాల‌నే క‌సితో విజ‌య్ ఈ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే.

“కింగ్‌డమ్” సినిమా మార్కెట్‌లోకి వచ్చినప్పటినుండి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. చాలా రోజుల తర్వాత టాలీవుడ్‌లో కొత్త సినిమా వ‌చ్చింద‌ని, ప్రేక్షకులు ఆసక్తిగా ఈ సినిమాను చూసి కామెంట్లు పెడుతున్నారు.

ర‌ష్మిక మంద‌న్నా స‌రైన టైమ్‌లో పోస్ట్

సినిమా స‌క్సెస్‌పై నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా కూడా తన ఆనందాన్ని పంచుకుంది. “ఇది నీకు, నిన్ను ప్రేమించే వారందరికీ ఎంత ముఖ్యమో నాకు తెలుసు. ‘మ‌నం కొట్టినం’” అంటూ ర‌ష్మిక తన సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ఫైల్‌ పోస్ట్ పై రియాక్షన్

ఈ పోస్ట్ కింద విజ‌య్ దేవ‌రకొండ కూడా స్పందిస్తూ “మ‌నం కొట్టినం” అని కామెంట్ చేశాడు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.