Site icon HashtagU Telugu

Randeep Surjewala : సీఎం ఎవరో ఇంకా డిసైడ్ చేయలేదు

Randeep Surjewala

Randeep Surjewala

కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్యను డిసైడ్ చేశారని ప్రచారం జరుగుతున్న వేళ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక కాంగ్రెస్ వ్యవహరాల ఇన్ ఛార్జి రణదీప్ సింగ్ సుర్జేవాలా (Randeep Surjewala)  కీలక ప్రకటన చేశారు. ఈ విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని .. ఫేక్ ప్రచారాలను నమ్మొద్దన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై  పార్టీ అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఇంకా చర్చలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఇదంతా బీజేపీ తప్పుడు ఎత్తుగడ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ALSO READ : Mamata Banerjee : వెస్ట్ బెంగాల్ సీఎం మ‌మ‌తా కీల‌క వ్యాఖ్య‌లు.. కాంగ్రెస్‌కు ష‌ర‌తుల‌తో కూడిన‌..?

సీఎం ఎవరు అనే దానిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  ప్రకటన చేస్తారని.. ప్రస్తుతానికి  చర్చల ద్వారా ఏకాభిప్రాయం సాధించే ప్రయత్నం చేస్తున్నామని రణదీప్ సింగ్ సుర్జేవాలా (Randeep Surjewala) వివరించారు. పార్టీలో ప్రతిదీ పారదర్శకంగా ఉంటుందని, సీఎం పదవి విషయంలో ఇవాలో రేపు అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలిపారు. 72 గంటల్లో కొత్త కేబినెట్ కొలువుదీరుతుందని, రాహుల్ గాంధీ చెప్పిన విధంగా కాంగ్రెస్ ఇచ్చిన 5 హామీలను అమలు చేస్తామన్నారు.