Rakhi: రాఖీ కట్టిన తర్వాత ఎప్పుడు తీసేయాలో తెలుసా?

రాఖీ పండుగ లేదా రాఖీపూర్ణిమ మన భారతదేశంలో చాలా ప్రాంతాలలో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ

  • Written By:
  • Publish Date - August 13, 2022 / 06:30 AM IST

రాఖీ పండుగ లేదా రాఖీపూర్ణిమ మన భారతదేశంలో చాలా ప్రాంతాలలో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ రాఖీ పండుగను అక్క తమ్ముళ్లు, అన్న చెల్లెలు ఎంతో సంతోషంతో జరుపుకుంటారు. ఈరోజు చెల్లెలు లేదా అక్క తన తమ్ముడికి లేదా అన్నకి రాఖీ కట్టి అతని శ్రేయస్సును కోరుకుంటూ ఉంటారు. అన్న లేదా తమ్ముడు కూడా తన చెల్లెలికి అక్కకు జీవితాంతం రక్షణ ఇస్తాను అని మాట ఇస్తాడు. అయితే ఈ రాఖీ ని కట్టిన తర్వాత దానిని ఎప్పుడు తీసేయాలి అన్నది చాలామందికి తెలియదు.

అయితే మన దేశంలోనే మహారాష్ట్ర సంస్కృతిలో రక్షా బంధన్ రోజు నుంచి 15 రోజుల పాటు సోదరుడు రాఖీని ధరించాలని చెబుతుంటారు. పదిహేను రోజులు అయిన తరువాత మహారాష్ట్రీయులు పోలా అనే పండుగను జరుపుకుంటారు. అదే శుభ సమయాన మరాఠీ రైతులు లార్డ్ మార్బోట్ దేవ్ ను ప్రార్థిస్తారు, అదే రోజున ఎద్దులను కూడా పూజిస్తారు. మన పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలో శుక్ల పక్షం పౌర్ణమి తిథిలో ఈ పండుగ జరుపుకుంటారు.

అయితే రాఖీ కట్టడం పూర్తి అయ్యే వరకూ చెల్లెలు ఉపవాసంతో ఉంటుంది. అలాగే ఉదయాన్నే లేచి అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్లు కొత్త బట్టలు ధరిస్తారు. ఆ తర్వాత రాఖీ కడతారు. అయితే మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రాఖీ రోజున థాలీని దియా అనే రుచికరమైన ఆహారాన్ని తీపి పచ్చి బియ్యం, కుంకుమ పువ్వుతో తయారు చేస్తారు. దీన్ని అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత అన్నదమ్ములకు పెడతారు.