Site icon HashtagU Telugu

Bullet Queen: బుల్లెట్ పై దూసుకెళ్తూ.. రికార్డులు నెలకొల్పుతూ!

Bullet

Bullet

ఆకాశంలో సగమైన ఆడవాళ్లు అన్నింట్లోనూ దూసుకుపోతున్నారు. మగవాళ్లకు కష్టసాధ్యమైన రంగాల్లో సైతం రాణిస్తూ ముందడుగు వేస్తున్నారు. కేవలం ‘ఇల్లు, ఆఫీసు’ అంటూ పరిమితులు పెట్టుకోకుండా తమ నచ్చిన పనులు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ‘నింగి నేలా’ తమదేనంటూ రికార్డులు తిరగరాస్తున్నారు.

ఆడవాళ్లు బుల్లెట్ బండిని నడపడం కొంచెం కష్టమే అని చెప్పాలి. కానీ తమిళనాడుకు చెందిన ఉపాధ్యాయురాలు రాజలక్ష్మి మందా అవలీలగా డ్రైవ్ చేస్తోంది. బుల్లెట్ పై దూసుకుపోవడమే కాకుండా, దానిపై దేశంలోని వివిధ ప్రాంతాలను చుట్టేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ హోల్డర్ ఈమె ఇప్పటివరకు 18 రాష్ట్రాలలో 30,000 కి.మీ ప్రయాణించారు. దేశ గొప్పతనాన్ని చాటేందుకు తాను బైక్‌ ర్యాలీ చేపట్టానని రాజ్యలక్ష్మి అన్నారు. ఆమె తమిళనాడులోని మధురైలో ప్రారంభించిన బైక్‌ ప్రయాణం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొనసాగుతోంది. బుల్లెట్ పై వెళ్తున్న ఆమెకు ప్రతిచోటా ఘనస్వాగతం లభిస్తోంది.