Kite Man : రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన అబ్దుల్ ఖాదర్ ఒకే దారంతో 1000 గాలిపటాలను ఎగరేశారు. అతడు ఒక్కడే కాకుండా.. ముందు రెండు తరాలు సైతం ఇదే తరహాలో గాలిపటాలను ఎగురవేయడంలో ప్రావీణ్యం సాధించాయి. గాలిపటాలను ఎగురవేయడంలో ప్రావీణ్యం కలిగిన అబ్దుల్ ఖాదర్ ఇంటర్నేషనల్ కైట్ రన్నర్‌గా పేరుగాంచాడు. గత 20 ఏళ్లుగా ఏటా సంక్రాంతి టైంలో ఆయన గాలిపటాల వేడుకల్లో పాల్గొంటున్నారు.హైదరాబాద్, కేరళ, గోవా, పంజాబ్‌లలో జరిగిన కైట్ ఫెస్టివల్స్‌లో పాల్గొన్నారు. ఇటీవల జరిగిన గుజరాత్ కైట్ ఫెస్టివల్లోనూ ఒకే దారంతో వెయ్యి గాలిపటాలను ఎగురవేశారు. ‘‘మా తాతగారు, తండ్రిగారు ఇద్దరూ గాలిపటాలను అద్భుతంగా ఎగరేసేవారు. మా ఇంటి నుంచి గాలి పటాలను ఎగరేయడంలో నైపుణ్యం కలిగిన మూడో తరం వ్యక్తిని నేను. చెక్క, బట్టలను ఉపయోగించి బ్యాలెన్స్ ఉండేలా గాలిపటాలను తయారు చేస్తాం’’ అని అబ్దుల్ ఖాదర్ వివరించారు.
We’re now on WhatsApp. Click to Join.
15 అడుగుల ఎలుగుబంటి ఆకారంలో, 45 అడుగుల మువ్వన్నెల జెండా ఆకారంలో, యుద్ధ విమానం, సీతాకోక చిలుక మాదిరిగా ఉండే గాలిపటాలను ఈయన తయారు చేశారు. వీటిని తయారు చేయాడానికి దాదాపు 15 రోజుల టైం పడుతుందని ఖాదర్ చెప్పారు. గాలిపటాలను ఎగరేయడమే కాకుండా.. వాటి ద్వారా ప్రజల్లో సామాజిక, సాంస్కృతిక, అవగాహన కల్పించేందుకు అబ్దుల్ ఖాదర్ ప్రయత్నిస్తున్నాడు. సేవ్ డాటర్, సేవ్ ఎన్విరాన్మెంట్, సేవ్ వాటర్, సేవ్ లేక్స్, కరోనాపై అవగాహన, మత సామరస్యం ఇలా అనేక అంశాలపై ప్రజల్లో చైతన్యం(1000 Kites – One String) కల్పించేందుకు కృషి చేస్తున్నాడు.
సంక్రాంతి పండగ పూట గాలిపటాల సరదా రాజధాని నగరంలో ఇద్దరి ప్రాణాలు తీసింది. రోడ్డుపై వెళుతూ చైనా మాంజా దారం తగిలి ఆర్మీ లో డ్రైవర్‌గా పని చేసే కోటేశ్వేర్ రెడ్డి మృతి చెందాడు. మరో ఘటనలో గాలిపటం ఎగురవేస్తూ అల్వాల్ పీఎస్‌లో పనిచేసే ఏఎస్సై కుమారుడు ఆకాష్ ఇంటిపై నుంచి కిందపడి మరణించాడు. దీంతో రెండు కుటుంబాల్లోనూ విషాదం నెలకొంది. ఇంటి నుంచి డ్యూటీకి వెళ్తున్న సమయంలో లంగర్‌హౌజ్ ఫ్లైఓవర్‌పై అడ్డుగా ఉన్న చైనా మాంజా మెడకు తగలడంతో తీవ్రంగా గాయపడ్డ కోటేశ్వర్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కోటేశ్వర్‌రెడ్డి స్వస్థలం విశాఖపట్నం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వేరే ఘటనలో గాలిపటం ఎగురవేస్తూ, ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడి ఆకాష్(20) అనే యువకుడు మృతి చెందాడు. పేట్ బహీరాబాద్‌లో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పండుగ రోజు కుమారుడు మృతి చెందడంతో ఆకాష్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.