MLA Rajasingh : ప్రధాని మోడీ రేపు తెలంగాణ బీజేపీ నేతలతో భేటీ కానున్నారు. ఈ క్రమంలోనే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలంగాణ అధ్యక్ష పదవి పై కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ చివరి నాటికి తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వస్తారని భావిస్తున్నట్టు చెప్పారు. తాను ఎప్పుడూ రాష్ట్ర పదవీని ఆశించలేదన్నారు. తాను అడగబోనన్నారు. హిందూధర్మ పట్ల ప్రతీ రాష్ట్రంలో ప్రచారం చేయాలనే సంకల్పంతో ఉన్నానని చెప్పారు. తెలంగాణ ప్రజలు ఏవిధంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారో ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి ప్రజల్లోకి ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేవలం మాటలకే పరిమితం అయ్యారని..మండిపడ్డారు.
మరోవైపు తెలంగాణ బీజేపీ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీతో రేపు మధ్యాహ్నం న్యూఢిల్లీలో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తోపాటు ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపూరి అర్వింద్, రఘునందన్‌రావు, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గడ్డం నగేష్ తదితరులు పాల్గొనున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఈ సందర్భంగా ప్రధాని మోడీతో బీజేపీ ఎంపీలు చర్చించనున్నారు. రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కమలనాథులు కసరత్తులు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొత్త వారిని నియమించే అవకాశాలున్నాయనే ఓ ప్రచారం అయితే సాగుతుంది. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించడంతోపాటు పలు కీలక అంశాలపై ప్రధానితో జరిగే భేటీలో ఎంపీలు చర్చించే అవకాశముందని సమాచారం.
Read Also: Devi Sri – Pushpa : దేవి శ్రీ తో వివాదం పై పుష్ప నిర్మాతలు క్లారిటీ