Daring Stunt: వైరల్ వీడియో.. వంతెన మధ్యలో నిల్చిపోయిన రైలు.. లోకో పైలెట్ ఏం చేశాడంటే?

ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా వాహన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

  • Written By:
  • Updated On - June 21, 2022 / 08:41 PM IST

ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా వాహన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ వాహన ప్రమాదాల వల్ల రోజు పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే ట్రాఫిక్ రూల్స్ ని అధిగమించ వద్దు అని పోలీసులు ఎంత చెప్పినా కూడా వాహనదారులు వినిపించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే కొంతమంది ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేసినా కూడా అవతల వారు తప్పు చేయడం వల్ల అనుకోకుండా ప్రాణాలను కోల్పోతున్నారు. కొన్ని కొన్ని సమయాల్లో వాహన డ్రైవర్లు కారణంగా కూడా ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి.

ఇలాంటి సమయాల్లోనే కొంతమంది తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే వందలాది మంది ప్రయాణించే రైలు నడిపేటప్పుడు ఆ లోకో పైలట్ ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల ఇప్పటికే ఎన్నోసార్లు రైలు ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సమయాల్లో లోకో పైలట్ లు తెలివిగా ప్రవర్తించి ఎంతోమంది ప్రాణాలను కాపాడారు. తాజాగా ఒక లోకో పైలెట్ కూడా ఒక పెద్ద సాహసమే చేశాడు.

వంతెన మధ్యలోనే నిలిచిపోయిన రైలులో సాంకేతిక సమస్ను పరిష్కరించడానికి ఒక లోకో పైలెట్ పెద్ద సాహసమే చేసి శభాష్ అనిపించుకున్నాడు. బోగీల కింద ప్రమాదకర స్థితిలో పాకుతూ వెళ్లి లీకేజ్ సమస్యను పరిష్కరించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను రైల్వే శాఖ ట్విట్టర్ ద్వారా పంచుకుంది. వంతెనపై నిలిచిపోయిన రైలును ప్రారంభించడానికి అసిస్టెంట్ లోకో పైలట్ ధైర్యసాహసాలు కనబర్చారని అని ట్వీట్ చేసింది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది. అసలు ప్రమాదానికి గల కారణం ఏమిటి అన్న విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.