Site icon HashtagU Telugu

Agnipath Protests: అగ్నిపథ్ ఆందోళనలతో రైళ్ల రాకపోకలకు అంతరాయం.. ఏకంగా 529 రైళ్లు రద్దు!

000

000

దేశ సంరక్షణలో భాగంగా పెద్ద ఎత్తున యువతను ఆర్మీలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈ పథకం ద్వారా 17.5 నుంచి 21సంవత్సరాల వయస్సు గల యువకులను ఆర్మీలో కి ఆహ్వానించి వారికి ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చిన అనంతరం మూడున్నర సంవత్సరాల పాటు విధులు నిర్వహించి వీరిలో ఎవరికైతే నైపుణ్యం ఉంటుందో అలాంటి వారిని 25 శాతం పాటు రెగ్యులర్ గా ఆర్మీలో కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు.

ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టడంతో దేశ వ్యాప్తంగా పలువురు ఈ పథకం పై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తూ పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ నిరసనలో భాగంగా దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర స్థాయిలో అంతరాయం కలిగించారు. ఈ పథకానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులు పెద్దఎత్తున రైల్వే స్టేషన్ లను ముట్టడించి తీవ్రస్థాయిలో నష్టాన్ని కలిగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ రైళ్ల రాకపోకలను రద్దు చేసింది.

ఈ క్రమంలోనే సోమవారం ఒకటే 529 రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. ఇందులో 181 ఎక్స్ప్రెస్ రైళ్లు కాగా 348 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ మంత్రి వెల్లడించారు. రద్దు చేసిన 71 రైలు ఢిల్లీ రాకపోకలకు సంబంధించినవేనని మంత్రి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడంతో నిరసనకారులు రైల్వేస్టేషన్లను ముట్టడించడంతో పెద్ద ఎత్తున రైల్వేస్టేషన్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మొత్తానికి ఈ ఘటనతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి.