Site icon HashtagU Telugu

Cloud Burst: ఒక్కసారిగా కుప్పకూలిన వంతెన.. ఆ వంద గ్రామాల పరిస్థితి దారుణం!

Simla

Simla

దేశవ్యాప్తంగా పలుచోట్ల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు, చెరువులకు భారీ స్థాయిలో నీరు వచ్చి చేరుతున్నాయి. కాగా ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాలలో కుంభవృష్టి కారణంగా చిన్నపాటి గ్రామీణ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడమే కాకుండా బ్రిడ్జిలు, రోడ్లు కొట్టుకుపోతున్నాయి. అయితే ఈ ఆకస్మిక వరదల కారణంగా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో భారీగా ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పటికే అరచేతిలో ప్రాణాలను పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న ఆ ప్రాంతాలవాసులకు తాజాగా వాతావరణ శాఖ మరొక భయాందోళన హెచ్చరికను జారీ చేసింది.

ఇప్పటినుంచి మరొక ఐదు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చు అని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఇలా ఉంటే తాజాగా కాంగ్రా జిల్లా చక్కి బ్రిడ్జి ఆకస్మిక వరదల కారణంగా ఒక్కసారిగా కుప్పకూలింది. వరదల కారణంగా పిల్లర్లు డామేజ్ కావడంతో వరద నీటిని తట్టుకోలేక అక్కడ ప్రజలు చూస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అంతేకాకుండా నదిలో కొట్టుకుపోయింది. పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ సరిహద్దు జిల్లా అయి కంగ్రాలో చక్కి నదిపై ఉన్న ఎనిమిది వందల మీటర్ల రైల్వే వంతెన శనివారం కుప్పకూలిపోయింది.

 

దీంతో వంతెన కొత్త పిల్లర్లను నిర్మించే అంతవరకు పటాన్ కోట్, జోగిందర్ నగర్ మధ్య రైల్వే రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. కాగా ఈ బ్రిడ్జి 1928లో నిర్మించారు. రోడ్డు బస్సు మార్గాలు అందుబాటు లేకపోవడంతో సాంగ్ డ్యాం వన్యప్రాణుల అభయ అరణ్యంలో ఉన్న వందల గ్రామాలకు ఈ ఒక్క రైలు మార్గం ఆధారం. కాగా ఈ నది గర్భంలో అక్రమ మైనింగ్ తో ఈ 90 ఏళ్ళు నాటి వంతెన బలహీన పడింది. అంతేకాకుండా గతంలో పిల్లలకు పగుళ్లు రావడంతో రైలు సేవలను నిలిపివేగా ఇప్పుడు ఏకంగా స్తంభమే కొట్టుకుపోయింది.