Site icon HashtagU Telugu

Rahul On Train: ఉదయ్ పూర్ రైలెక్కిన రాహుల్ గాంధీ..చింతన్ శిబిర్ కు హాజరు..!!

rahul on train

rahul on train

రాహుల్ గాంధీ ఉదయ్ పూర్ కు పయనమయ్యారు. 2024 ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మేథోమధనం కోసం చింతన్ శిబిర్ పేరిట నిర్వహిస్తున్న సభకు పార్టీ కీలక నేతలంతా ఉదయ్ పూర్ కు వెళ్లారు. ఇప్పటికే పలు రాష్ట్రాలకు చెందిన ఆ పార్టీ నేతలంతా కూడా ఉదయ్ పూర్ కు చేరుకున్నారు. తాజాగా గురువారం ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు.
ఢిల్లీ నుంచి ఉదయ్ పూర్ చేరుకునేందుకు రాహుల్ గాంధీ రైలు ప్రయాణం ద్వారా వెళ్తున్నారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలోని రోహిల్లా రైల్వే స్టేషన్ వెళ్లి…అక్కడి నుంచి ఉదయ్ పూర్ రైలు ఎక్కారు. ఇక శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న చింతన్ శిబిర్ ఈ నెల 15వరకు మూడురోజుల పాటు కొనసాగనుంది. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా పార్టీ హైకమాండ్ 400మంది కీలక నేతలకు ఆహ్వానం పంపించిన విషయం తెలిసిందే.