కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తోన్న భారత్ జోడో యాత్ర అక్టోబర్ 24న తెలంగాణలో ఎంటర్ కానుంది. ఇందుకు రూట్ మ్యాప్ ఫైనల్ అయ్యింది. రాష్ట్రంలో మొత్తం 13రోజుల పాటు 359 కిలోమీటర్లు రాహుల్ గాంధీ నడవనున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణా మండలం, కృష్ణా గ్రామం వద్ద తెలంగాణలోకి ఎంట్రీ కానుంది రాహుల్ భారత్ జోడో యాత్ర.
తొలిరోజు మక్తల్ అసెంబ్లీ సెగ్మెంట్ భారత్ జోడో యాత్ర ఉండనుంది. రాహుల్ పాదయాత్రలో కొడంగల్, నారాయణ పేట, గద్వాల్, అలంపూర్ నియోజకవర్గ నేతలతోపాటు రాష్ట్ర ముఖ్య నేతలు పాల్గొంటారు. 2వ రోజు దేవరకద్ర నియోజకవర్గంలో.. 3వ రోజు మహబూబ్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో జోడో యాత్ర చేయనున్నారు. 4వ రోజు జడ్చర్ల అసెంబ్లీ సెగ్మెంట్‌లో, 5వ రోజు షాద్ నగర్ నియోజకవర్గంలో రాహుల్ పాదయాత్ర చేయనున్నారు. 6వ రోజు శంషాబాద్ ప్రాంతంలో జరిగే యాత్రలో, 7వ రోజు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రాహుల్ పాదయాత్ర చేయనున్నారు.
8వ రోజు బీహెచ్ఈఎల్ ప్రాంతంలో రాహుల్ పాదయాత్ర సాగనుంది. 9వ రోజు సంగారెడ్డిలో, 10వ రోజు
జోగిపేటలో, 11వ రోజు శంకరంపేట ప్రాంతంలో, 12వ రోజు జుక్కల్ ప్రాంతాల్లో, 13వ రోజు కూడా
జుక్కల్ లోనే యాత్ర సాగనుంది. 13వ రోజు సాయంత్రంతో రాహుల్ పాదయాత్ర తెలంగాణలో ముగియనుంది.