ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా..? చూడటానికి అందంగా…స్టైలీష్ గా కనిపిస్తున్న నేత భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీలా కనిపిస్తున్నారు కదా…అవును ఈ ఫొటోను చూస్తే..రాజీవ్ గాంధీనే గుర్తుకు వస్తున్నారు. అయితే ఈ ఫొటోలో ఉన్నది రాజీవ్ గాంధీ కాదు…ఆయన కుమారుడు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడిగా పనిచేసిన రాహుల్ ..ఇప్పుడు పార్టీ ఎంపీగా ఉన్నారు. అయినా పార్టీ సారథ్య బాధ్యతలను మోస్తూ ముందుకు సాగుతున్నారు.
శుక్రవారం లండన్ పర్యటనకు వెళ్లారు రాహుల్. ఐడియాస్ ఫర్ ఇండియా పేరిట నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. సదస్సు నిర్వాహుకుడితో మాట్లాడుతున్న సందర్భంలో కుర్చిలో కాలుపై కాలేసుకుని మాట్లాడుతున్న రాహుల్ ఫొటోను తీసిన మీడియా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటో చూసిన చాలామంది నెటిజన్లు…రాజీవ్ గాంధీని గుర్తుకు చేసుకుంటూ…కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫొటో నెట్టింట్లో వైరల్ గా మారింది.
Rajeev Gandhi Xerox😍😍
Congress Leader @RahulGandhi at #IdeasForIndia conference in London pic.twitter.com/brR7Vyqvrj
— Team Congress (@TeamCongressINC) May 20, 2022