Rahul Sprints: రాహుల్ రన్నింగ్.. జోష్ నింపుతున్న జోడో యాత్ర!

తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడోయాత్ర కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ యాత్రలో

  • Written By:
  • Updated On - October 30, 2022 / 02:21 PM IST

తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడోయాత్ర కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ యాత్రలో పిల్లల నుంచి పెద్దల వరకు అందర్నీ ఆకర్షిస్తూ రాహుల్ గాంధీ జోష్ నింపుతున్నారు. రాష్ట్రంలో ఐదో రోజు పాద యాత్రలో భాగంగా ఆదివారం జడ్బర్లలో రాహుల్ పాదయాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులందరినీ ఉత్తేజ పరిచారు. యాత్రలో నడుస్తున్న రాహుల్ వద్దకు కొంతమంది చిన్నారులు వచ్చారు. ఇంతలో మనం పరుగెత్తుదామా.. రెడీ వన్ టు త్రీ అంటూ రాహుల్ రన్నింగ్ మొదలు పెట్టారు. రాహుల్ ను చూసి పక్కనే ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పరుగు అందుకున్నారు.

రాహుల్ పరుగులు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతని వెంట పెద్ద సంఖ్యలో భద్రతా దళాలు కూడా ఉన్నాయి.  నిన్న కూడా మహబూబ్ నగర్ జిల్లాలో గిరిజన కళాకారుల బృందంతో గాంధీ డ్యాన్స్ చేశారు. “మన ఆదివాసీలు మన కాలాతీత సంస్కృతులు, వైవిధ్యాల భాండాగారాలు. కొమ్ము కోయ గిరిజన నృత్యకారులతో కలిసి స్టెప్పులు వేసి ఆనందించారు. వారి కళ వారి విలువలను వ్యక్తపరుస్తుంది’’ అంటూ ట్వీట్ చేశారు.

రాష్ట్రంలో మొత్తం 375 కి.మీ నడుస్తూ 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాలను రాహు కవర్ చేయనున్నారు. నవంబర్ 4న యాత్రకు ఒకరోజు విరామం ఇస్తారు. రాష్ట్రంలో పాదయాత్ర జరిగే సమయంలో రాహుల్ గాంధీ క్రీడా, వ్యాపార, సినీ రంగాలకు చెందిన ప్రముఖులతో సహా మేధావులు, వివిధ సంఘాల నాయకులతో సమావేశమవుతారు.