Rahul – Modi – God : మోడీజీ ప్రపంచాన్ని ఎలా నడపాలో దేవుడికే నేర్పిస్తారు : రాహుల్

Rahul - Modi - God : అమెరికా టూర్ లో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీ టార్గెట్ గా కీలక వ్యాఖ్యలు చేశారు. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన 'మొహబ్బత్ కీ దుకాణ్' కార్యక్రమంలో రాహుల్ 22 నిమిషాలు ప్రసంగించారు. "మోడీజీ.. ప్రపంచాన్ని ఎలా నడపాలో దేవుడికి(Rahul - Modi - God) కూడా నేర్పిస్తారు.

  • Written By:
  • Updated On - May 31, 2023 / 10:19 AM IST

Rahul – Modi – God : అమెరికా టూర్ లో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీ టార్గెట్ గా కీలక వ్యాఖ్యలు చేశారు. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ‘మొహబ్బత్ కీ దుకాణ్’ కార్యక్రమంలో రాహుల్ 22 నిమిషాలు ప్రసంగించారు. “మోడీజీ.. ప్రపంచాన్ని ఎలా నడపాలో దేవుడికి(Rahul – Modi – God) కూడా నేర్పిస్తారు. మోడీజీ చెప్పేది విని  దేవుడు కూడా షాక్ అవుతాడు. తాను ఎలాంటోన్ని పుట్టించానని దేవుడు కూడా నోరెళ్లబెడతాడు” అని రాహుల్ కామెంట్ చేశారు. ఈ ప్రోగ్రాం సందర్భంగా భారతీయ సమాజానికి చెందిన పలువురు రాహుల్ కు ప్రశ్నలు వేశారు. ఆ వివరాలు ఇవీ.. 

మహిళా సాధికారత సంస్థ సభ్యురాలు ఝాన్సీ రెడ్డి :  మహిళా రిజర్వేషన్ బిల్లు ఏళ్ల తరబడి చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది?

రాహుల్: ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బిల్లును కచ్చితంగా ఆమోదిస్తాం. గత ప్రభుత్వంలో కొన్ని పార్టీలు మాతో లేవు. ఇప్పుడు అలా జరగదు.

ఫ్యూగల్ అన్భు (తమిళనాడు ఎన్ఆర్ఐ)  : తమిళ ప్రజల మధ్య సోదర బంధం ఉంది. ప్రతి మనిషినీ సమానంగా పరిగణిస్తాం. భారతదేశంలో వివిధ మతాలు, కులాలు,  సంస్కృతుల ప్రజలు నివసిస్తున్నారు. రాహుల్ జీ.. మీరు అమెరికాలో చదువుకున్నారు. ఇక్కడ ప్రతి రాష్ట్రానికి దాని సొంత రాజ్యాంగం ఉంది. నా ప్రశ్న ఏమిటంటే, భారతదేశాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియాగా మార్చడం గురించి మీరు ఏమనుకుంటున్నారు?

రాహుల్: మన రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలు, కులాలు, సంస్కృతికి చెందినవారు సమానమే. వారికి రక్షణ కల్పించాలి. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యక్తులు భారతదేశ వైవిధ్యానికి ముప్పు. నాకు తమిళ భాష కేవలం ఒక భాష కాదు.. అది తమిళ ప్రజల మొత్తం సంస్కృతి. తమిళ భాషను తక్కువ చేయడాన్ని నేను ఎప్పటికీ అంగీకరించను. ఎందుకంటే అది భారతదేశ నాగరికతకు చేటు కలిగిస్తుంది. ఏ భాషకైనా ముప్పు వాటిల్లితే అది భారతదేశ సమైక్యతకు ముప్పు. మన బలం భిన్నత్వంలోనూ కలిసి పని చేయడంలోనే ఉంది.

Also read : Rahul Gandhi: రాహుల్ అమెరికా పర్యటన ప్రచార కార్యక్రమాలు షురూ

గణపతి : భారతదేశంలో ఫాసిజం ఒక పెద్ద సమస్య.. అటువంటి పరిస్థితిలో మీరు ఆర్థికపరంగా,అభివృద్ధిపరంగా ప్రతి తరగతి ప్రజలను ఎలా కవర్ చేస్తారు?

రాహుల్: మన దేశంలో వివిధ కులాలు, మతాల వారు నివసిస్తున్నారు. వాటిని తెలుసుకోకుండా.. వాటి గురించి సరైన విధానాన్ని రూపొందించడం సాధ్యం కాదు. అందుకే కుల గణన కోసం కాంగ్రెస్ నిరంతరం బీజేపీపై ఒత్తిడి తెస్తోంది. వివిధ ప్రభుత్వ పథకాల ద్వారానే ప్రజలందరినీ మనం రక్షించగలం. భారతదేశంలో అసలు సమస్యలు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, విద్యాహక్కు. దీని నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.

మహ్మద్ ఖాన్ : మీరు ద్వేషాల బజారులో ప్రేమ దుకాణాన్ని తెరిచారు. భారతదేశంలో ముస్లింల భద్రతకు ముప్పు పొంచి ఉంది. వారికి వ్యతిరేకంగా అనేక చట్టాలు చేస్తున్నారు. ముస్లిం పిల్లలు చేయని నేరాలకు జైలులో పెడుతున్నారు. దీనిపై మీరేం అంటారు ?

రాహుల్: నేడు భారతదేశంలో ముస్లిం సమాజం, అన్ని మైనారిటీలపై వివక్ష ఉంది. కొందరి వద్ద దేశంలోని మొత్తం డబ్బు ఉంది. మైనారిటీలు పేదరికంలో మగ్గిపోతున్నారు. కానీ మీరు ద్వేషంతో ద్వేషాన్ని చంపలేరు. భారతీయ ప్రజలు ద్వేషాన్ని నమ్మరు. కొందరు వ్యక్తులు వ్యవస్థను, మీడియాను అడ్డం పెట్టుకొని బతుకుతున్నారు. నేను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర చేశాను. భారతదేశంలోని సాధారణ పౌరులకు అలాంటి మత విద్వేష  ఆలోచన లేదు. మనం కలిసి ఈ వివక్షను ఎదుర్కొందాం. ప్రేమతో దాని జయిస్తాం.

భారత విద్యార్ధి ( యూసీ బర్కీలీ యూనివర్సిటీ)  : విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు తిరిగి వెళ్లి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నారు. కానీ ఇవాళ అక్కడ కుస్తీల పరిస్థితిని చూసి.. మళ్ళీ విదేశాలకు వెళ్లిపోతున్నారు. మీరు మా కోసం ఏం చేస్తారు?

రాహుల్: మీడియా చూపించేది భారతదేశం కాదు. అవి దేశంలోని ద్వేషాన్ని మాత్రమే హైలైట్ చేస్తాయి. కానీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలలో చాలా ప్రేమ ఉంది. అటువంటి పరిస్థితిలో మీరు తిరిగి దేశానికి రండి. మీరంతా విదేశాల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీని ఓడించాలంటే మీరు ఆ భావాలను ముందుకు తీసుకెళ్లాలి.