Site icon HashtagU Telugu

Congres : రేపు తెలంగాణకు రానున్న రాహుల్‌ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే

Rahul Gandhi and Mallikarjun Kharge will come to Telangana tomorrow

Rahul Gandhi and Mallikarjun Kharge will come to Telangana tomorrow

PCC Meeting : ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు తెలంగాణకు రానున్నారు. ఈ మేరకు రేపు సాయంత్రం 4 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న ఇద్దరు సీనియర్ నేతలు.. అక్కడి నుంచి బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ కేంద్రానికి చేరుకుంటారు. అనంతరం నిర్వహించే పీసీసీ సమావేశం లో పాల్గొంటారు. అక్కడ పార్టీ నేతలు, విద్యావేత్తలతో సమావేశమై కులగణనపై సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. ఈ సమావేశానికి దాదాపు 400 మందికి ఆహ్వానం అందినట్లు సమాచారం.

ఇకపోతే.. ఈ సమావేశంలో ముఖ్యంగా కులగణనపైనే కాంగ్రెస్ అగ్రనేతలు ఫోకస్ చేయనున్నారట. కాస్ట్‌సెన్సెస్‌ ని ఎలా అమలు చేయాలనే దానిపై మేధావులు, సీనియర్లతో రాహుల్, ఖర్గేలు చర్చిస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే నవంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కుటుంబ సర్వే అనంతరం ఈ కులగణన జరగనున్న విషయం తెలిసిందే. ఈ సర్వేతో రాష్ట్రంలో ఏ కులాల వాళ్లు ఎంతమంది ఉన్నారు..? ఏ కులాలు వెనుకబడి ఉన్నాయి..? ఏ కులాలకు ప్రభుత్వ సహాయం ఎక్కువగా అవసరం..? అనే విషయాలను తెలుసుకుని ఆ డేటా ఆధారంగా సంపదను పంపిణీ చేయాలనేది కాంగ్రెస్‌ ప్రభుత్వ ఆలోచన.

కాగా, సీఎం రేవంత్ రెడ్డి కోరిక మేరకు ఖర్గే, రాహుల్ హైదరాబాద్ వస్తున్నట్లు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. కులగణన విషయంలో రాహుల్‌‌గాంధీ కి ఉన్న చిత్తశుద్ధికి ఈ పర్యటనే సాక్ష్యమని అన్నారు. కుల గణన సర్వేలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త భాగస్వామి కావాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో శనివారం డీసీసీ మీటింగ్ లు ఏర్పాటు చేసి, కుల గణనపై అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేయడం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

Read Also: Kasthuri Shocking Comments : నటి కస్తూరి కామెంట్స్ ఫై పొంగులేటి ఆగ్రహం