Raghunandan Rao : గల్లీలో.. ఢిల్లీలో లేని.. కారును గెలిపిస్తే మిగిలేది శూన్యమే: రఘునందన్ రావు

Raghunandan Rao:మెదక్‌ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ఎం రఘునందన్ రావు సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని రెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో మెదక్‌ పార్లమెంట్‌ జరిగిన కిసాన్‌ మోర్చా(kisan morcha) సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌, రెవంత్‌రెడ్డిలపై విమర్శలు గుప్పించారు. గల్లీలో లేని ఢిల్లీలో లేని కారును గెలిపిస్తే మనకు మిగిలేది శూన్యమేనని ఆయన అన్నారు. We’re now on WhatsApp. Click to Join. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నో […]

Published By: HashtagU Telugu Desk
Raghunandan Rao Comments On

Raghunandan Rao comments on kcr and revanth reddy

Raghunandan Rao:మెదక్‌ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ఎం రఘునందన్ రావు సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని రెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో మెదక్‌ పార్లమెంట్‌ జరిగిన కిసాన్‌ మోర్చా(kisan morcha) సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌, రెవంత్‌రెడ్డిలపై విమర్శలు గుప్పించారు. గల్లీలో లేని ఢిల్లీలో లేని కారును గెలిపిస్తే మనకు మిగిలేది శూన్యమేనని ఆయన అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నో రేవంత్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చారని.. అయితే కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ ఐదు నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. గతంలో ముఖ్యమంత్రిగా కేసిఆర్ నూరు అబద్ధాలు ఆడితే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి వెయ్యి అబద్ధాలు ఆడేందుకు సిద్దంగా ఉన్నారని వ్యంగ్యంగా అన్నారు.

Read Also: AP Politics : ఉమ్మడి రాజధానిపై కేటీఆర్ & జగన్ వ్యూహం..?

కాంగ్రెస్ హయాంలో రైతులకు ఎరువుల కోసం చెప్పులు లైన్‌లో పెట్టిన విషయం మరవద్దంటూ ప్రజలకు రఘునందనరావు సూచించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడ ఎరువుల కొరత అనేదే లేకుండా చూశారని చెప్పారు. కమలం గుర్తుకు ఓటు వేసి తనను నరేంద్ర మోడీ నాయకత్వంలో పని చేసేందుకు పంపాలని ఈ సందర్బంగా ప్రజలకు రఘునందనరావు మనవి చేశారు.

Read Also:AP Polls : ముగిసిన నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు

కాగా, దుబ్బాక నియోజకవర్గం మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి అవగాహన లేదన్నారు. ఆయనకు డబ్బులు పెట్టి ఓట్లు కొనడం మాత్రమే తెలుసునని చెప్పారు. ఓటర్లను బానిసలుగా చూసే సంస్కారం కొత్త ప్రభాకర్ రెడ్డిదని ఆభివర్ణించారు. ఎంపీ ఎన్నికలు పూర్తికాగానే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరడం ఖాయమని స్పష్టం చేశారు.

  Last Updated: 29 Apr 2024, 06:42 PM IST