Site icon HashtagU Telugu

Shashi Tharoor: మరోసారి శశిథరూర్ ఇంగ్లీష్ పైత్యం…తెరపైకి కొత్త పదం.!!

Shashi Tharoor

Shashi Tharoor

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ గురించి తెలుసు కదా. ఆయన మాట్లాడే ఇంగ్లీష్ గురించి కూడా తెలిసే ఉంటుంది. ఆయన వాడే వొకాబ్యులరీ అర్థం చేసుకోవాలంటే…ఇంగ్లీష్ ఎంతో ప్రావీణ్యులై ఉండాలి. పలకడానికి కష్టంగా ఉండే పలు పదాలను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేశారు. అలాంటి పదాలు ఇంగ్లీష్ లో ఉన్నాయన్న విషయం తెలియని చాలామంది శశిథరూర్ టాలెంట్ పట్ల విస్మయం చెందుతుంటారు. పలు అంశాల పట్ల స్పందించే సమయంలో ఈ కొత్త పదాలను ప్రయోగిస్తుంటారు.

ఇప్పుడు ఆయన ఇలాంటిదే మరో పదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఆ పదం ఏంటంటే quomodocunquize.రైల్వే శాఖను విమర్శించే క్రమంలో ఆయన ఈ పదాన్ని ఉపయోగించారు. quomodocunquize అంటే ఏవిధంగానైనా డబ్బు సంపాదించడం అని అర్థం. ఆ పదానికి అర్థం కూడా ఆయన్నే వివరించారు. వృద్ధులకు రైలు ప్రయాణాల్లో రాయితీపై రైల్వే శాఖను ప్రశ్నిస్తూ..ఆయన ఈ పద ప్రయోగం చేశారు. ఎలాగైనా సరే భారతీయ రైల్వే డబ్బులు సంపాదించాలని భావిస్తోందా అంటూ ప్రశ్నించారు.

అయితే శశిథరూర్ ఈ విధంగా వ్యాఖ్యానించడానికి కూడా కారణం ఉంది. ఈ మధ్యే భారత రైల్వే శాఖ ఓ ప్రకటన చేసింది. ఇప్పటికే టికెట్ల ధరలు తక్కువగా ఉన్నాయని..ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ సిటిజన్లకు టికెట్ల ధరలపై రాయితీని పునరుద్ధరించలేమని రైల్వే శాఖ తెలిపింది. ఇక శశి థరూర్ కొత్త పదాన్ని పరిచయం చేయడంతో నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. తాము పాత పాస్ వర్డ్ లు మార్చేసుకుని quomodocunquize పదాన్ని కొత్త పాస్ వర్డ్ గా మార్చుకుంటామని మీమ్స్ తో బదులిస్తున్నారు.