Queen’s Diamond: ఎలిజిబెత్-2 కు ఖరీదైన వజ్రాభరణం ఎవరు ఇచ్చారో తెలుసా? దీని ప్రత్యేకత ఏమిటంటే?

ఎలిజబెత్ ఈ పేరును మనం వినే ఉంటాం. అయితే ఈ ఎలిజిబెత్ 2 అనేక రకాల విలువైన ఆభరణాలు ఉండగా,

  • Written By:
  • Publish Date - September 10, 2022 / 09:15 AM IST

ఎలిజబెత్ ఈ పేరును మనం వినే ఉంటాం. అయితే ఈ ఎలిజిబెత్ 2 అనేక రకాల విలువైన ఆభరణాలు ఉండగా, అందులో హైదరాబాద్ నిజాం నవాబు బహుకరించింది కూడా ఒకటి ఉంది. కాగా నవంబర్ 20 1947లో ఎలిజిబెత్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ వివాహానికి కానుకగా ఆనాటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా 300 వజ్రాలతో రూపొందించిన ఒక ప్లాటినం నెక్లెస్ ను కానుకగా అందించారట. కాకా 70 ఏళ్ల తన పాలనలో బ్రిటన్ రాణి అయినా ఎలిజిబెత్ 2 ఎన్నో విలువైన కానుకలను అందుకుంది.

అయితే ఎన్నో కానుకలను అందుకున్నప్పటికీ నిజాం నవాబు ఇచ్చినది మాత్రం ప్రత్యేకమైనది అని చెప్పుకోవచ్చు. అయితే ఇందుకు గల కారణం నిజాం నవాబు ఇచ్చిన డైమండ్ ప్లాటినం నెక్లెస్ ను ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ కార్టియర్ తయారుచేసింది. ఎలిజిబెత్ రాణి స్వయంగా వివాహ కానుకను సెలెక్ట్ చేసుకోవాలని, అందుకు అనుగుణంగానే ఆభరణాన్ని తయారు చేయాలి అంటూ నిజాం నవాబు నందరిలోని కార్టియర్ కంపెనీకి సూచించారు.

అయితే బ్రిటన్ రాణి ఎలిజబెత్ ప్లాటినంతో చేసిన ఆ వజ్రాల నెక్లెస్ ను ధరించిన ఫొటోను ఈ ఏడాది జులై 21న బ్రిటన్ రాజ కుటుంబం అధికారిక ఇన్ స్టా గ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. 1952లో రాణివాసం చేసిన తర్వాత కూడా ఎలిజబెత్ దీన్ని ధరించారు. నాటి ఫొటోను కూడా ఇన్ స్టా గ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. అందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.