QualiZeal : మహిళల కోసం వర్క్‌ఫోర్స్ రీఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్‌ ప్రారంభించిన క్వాలిజీల్

ప్రతిభ, నైపుణ్యం మరియు ఆశయం కాలక్రమేణా మసకబారవని క్వాలిజీల్ విశ్వసిస్తుంది. అదే సమయంలో కెరీర్ విరామం తర్వాత తిరిగి ఉద్యోగాలలోకి ప్రవేశించేటప్పుడు మహిళలు ఎదుర్కొనే సవాళ్లను గుర్తిస్తుంది. రీస్టార్ట్ విత్ క్వాలిజీల్ దీనిని మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది.

Published By: HashtagU Telugu Desk
Qualiziel Launches Workforce Reintegration Program For Women

Qualiziel Launches Workforce Reintegration Program For Women

QualiZeal: ఆధునిక క్వాలిటీ ఇంజనీరింగ్‌లో అగ్రగామి క్వాలిజీల్, కెరీర్ విరామం తర్వాత మహిళా నిపుణులు తిరిగి ఉద్యోగాలలో చేరటానికి అవకాశం కల్పించే కార్యక్రమం, రీస్టార్ట్ విత్ క్వాలిజీల్ (క్వాలిజీల్‌తో పునఃప్రారంభించండి) ను ఇటీవలే ప్రారంభించింది. ప్రతిభ, నైపుణ్యం మరియు ఆశయం కాలక్రమేణా మసకబారవని క్వాలిజీల్ విశ్వసిస్తుంది. అదే సమయంలో కెరీర్ విరామం తర్వాత తిరిగి ఉద్యోగాలలోకి ప్రవేశించేటప్పుడు మహిళలు ఎదుర్కొనే సవాళ్లను గుర్తిస్తుంది. రీస్టార్ట్ విత్ క్వాలిజీల్ దీనిని మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా వారికి నిర్మాణాత్మక శిక్షణ & అదనపు నైపుణ్యాలను అందించటం, మార్గనిర్దేశకత్వం & కెరీర్ గైడెన్స్ తో పాటుగా సౌకర్యవంతమైన పని వాతావరణం కల్పించటం, గత అనుభవానికి అనుగుణంగా అవకాశాలు అందించటం చేయనుంది. 43% మహిళా ఉద్యోగులతో , డైవర్సిటీ (వైవిధ్యం) , ఈక్విటీ(సమానత్వం) మరియు ఇంక్లూషన్ (సమ్మిళిత ) (DEI)ను పెంపొందించడానికి నిదర్శనంగా క్వాలిజీల్ నిలుస్తోంది.

Read Also: Milk Price Hike : కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో షాక్

లింగ వైవిధ్యం మరియు సమానత్వం పట్ల క్వాలిజీల్ యొక్క నిబద్ధత గురించి క్వాలిజీల్ సహ వ్యవస్థాపకుడు & ఇండియా ఆపరేషన్స్ హెడ్ మధు మూర్తి మాట్లాడుతూ.. “వైవిధ్యం, సమానత్వం మరియు సమ్మిళితకు విలువనిచ్చే వాతావరణంలో నిజమైన ఆవిష్కరణ వృద్ధి చెందుతుంది. మా వేగవంతమైన వృద్ధి అసాధారణ ప్రతిభతోనే సాధ్యమైంది. ప్రతి ప్రొఫెషనల్ – కెరీర్ బ్రేక్‌లతో సంబంధం లేకుండా – అభివృద్ధి చెందే అవకాశం ఉందని నిర్ధారించడానికి మేము కట్టుబడి ఉన్నాము. ‘క్వాలిజీల్‌తో పునఃప్రారంభించండి’ అనేది మహిళలను తిరిగి ఉద్యోగంలోకి స్వాగతించడం మాత్రమే కాదు, టెక్ పరిశ్రమకు బలమైన, మరింత శక్తివంతమైన భవిష్యత్తును సృష్టించడానికి వారి నైపుణ్యం, స్థిరత్వం మరియు తాజా దృక్పథాలను ఉపయోగించడం గురించి” అని అన్నారు.

Read Also: Veera Dheera Sooran : ‘వీర ధీర శూర’కు లైన్ క్లియర్..షోస్ స్టార్ట్

  Last Updated: 27 Mar 2025, 07:11 PM IST