Putin Health: రష్యాలో తీవ్ర కలకలం, పుతిన్ ఆరోగ్య పరిస్థితి విషమం.!!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది.

  • Written By:
  • Publish Date - May 17, 2022 / 07:15 AM IST

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది. నిన్నటి మొన్నటి వరకు యుద్ధం కారణంగా పుతిన్ వార్తల్లో నిలిచారు. ఇఫ్పుడు అతని ఆరోగ్యం గురించి మరో కీలకమైన అప్ డేట్ వెలువడింది. పుతిన్ తీవ్ర అనారోగ్య పరిస్థితిలో ఉన్నట్లు సమాచారం. ఆయన బ్లడ్ క్యాన్సర్ తో ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నదని మాజీ గుఢాచారి క్రిస్టఫర్ స్టీల్ వెల్లడించారు. అమెరికాకు చెందిన ఓ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. కచ్చితంగా ఆయన అనారోగ్యానికి సంబంధించిన సమస్య తెలియదు. అది నయం అవుతుందా కాదా అని కూడా తెలియదు. కానీ యుద్ధ సమీకరణాల్లో అదీ ఓ భాగమే. రష్యా నుంచి ఇతర చోట్ల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పుతిన్ చాలా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. వాస్తవానికి ఉక్రెయిన్ పై యుద్ధానికి ముందు నుంచే పుతిన్ ఆరోగ్యం బాగలేదని తెలుస్తోంది.

రష్యాలో అత్యంత సంపన్న వ్యక్తి ఒకరు పుతిన్ అనారోగ్యం గురించి చెప్పారు. క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఆయన వెన్నుకు శస్త్రచికిత్స జరిగిందని…ఉక్రెయిన్ పై యుద్ధ ప్రకటనుకు ముందే ఇది చోటుచేసుకున్నట్లు చెప్పారు. ఆయనకు పుతిన్ చాలా సన్నిహిత సంబంధం ఉంది. పుతిన్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని క్రిస్టోఫర్ చెబుతున్నప్పటికీ…రష్యా ప్రభుత్వ అధికారులెవరూ అధికారికంగా ధృవీకరించలేదు.

గతనెలలో పుతిన్ అనారోగ్యానికి సంబంధించి రష్యాకు చెందిన ఓ మీడియా సంస్థ ప్రచురించిన కథనం అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ 2016నుంచి థైరాయిడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారని దానికి చికిత్స చేయించుకునేందుకు కొన్నిసార్లు  అజ్ఞాతంలో వెళ్లారని ఈ కథనం సారాంశం. చికిత్సలో భాగంగా ఎర్ర జింక కొమ్ముల నుంచి తీసిన రసంతో పుతిన్ స్నానం చేయాలని వైద్యులు తెలిపినట్లు సమాచారం. 2016 నుంచి 2019 వరకు థైరాయిడ్ క్యాన్సర్ సర్జన్ తోపాటు చాలామంది వైద్యులు నగరంలోని పుతిన్ నివాసానికి వెళ్లి పరామర్శించినట్లు తెలిపింది. అధికారికంగా సందర్శనలు తేదీలను పుతిన్ కనిపించకుండా పోయిన రోజులు, స్థానిక హోటల్లో బస చేసిన వివరాలను వెల్లడించింది. అయితే పుతిన్ క్యాన్సర్ తో బాధపడుతున్నారా లేదా ఇంకేదైనా అనారోగ్యంతో బాధపడుతున్నారన్న విషయాన్ని ప్రస్తావించలేదు. పుతిన్ రాజకీయాల్లో గత 23ఏళ్లుగా ఉన్నా ఆయన మానసిక పరిస్థితి గురించి ప్రజలకు ఎలాంటి విషయం తెలిదని తన కథనంలో పేర్కొంది.