Site icon HashtagU Telugu

Putin : ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పుతిన్‌

Russia Warning

Russia Warning

Vladimir Putin: వరుసగా ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమర్‌ పుతిన్‌ బాధ్యతలు స్వీకరించారు. ఆదేశ అధ్యక్ష కార్యాలయమైన క్రెమ్లిన్‌లో జరిగిన కార్యక్రమంలో పుతిన్‌ రాజ్యాంగంపై ప్రమాణం చేసి బాధ్యతుల స్వీకరించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జాతీయ పార్లమెంట్‌కు చట్టసభ ప్రతినిధులు, న్యాయమూర్తులు పాల్గొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్భంగా పుతిన్‌ మంత్రులు మరియు ప్రముఖుల ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ..మేము ఐక్యమైన గొప్ప వ్యక్తులం..మేము కలిసి అన్ని అడ్డంకులను అధిగమిస్తామన్నారు. మేము మా ప్రణాళికలన్నింటినీ ఫలవంతం చేస్తాము మరియు కలిసి మేము గెలుస్తాము” అని పుతిన్‌ అన్నారు.

Read Also: Pak Pacer: పాక్‌కు మ‌రో ఎదురుదెబ్బ‌.. స్టార్ ఆట‌గాడికి వీసా స‌మ‌స్య‌..!

రెడ్ కార్పెట్ మార్గం అతనికి సుపరిచితమే కావచ్చు. కానీ మే 2000లో జరిగిన అధ్యక్షుడు పుతిన్ మొదటి ప్రమాణ స్వీకారోత్సవం నుండి చాలా మార్పు వచ్చింది. కాగా, “ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానని మరియు అభివృద్ధి చేస్తానని” మరియు “రష్యాను జాగ్రత్తగా చూసుకుంటానని” ప్రతిజ్ఞ అధ్యక్షుడు పుతిన్ చేశారు. ఇరవై నాలుగు సంవత్సరాల తరువాత, క్రెమ్లిన్ నాయకుడు ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నాడు.

మరోవైపు “పుతిన్ ఇప్పుడు తనను తాను వ్లాదిమిర్ ది గ్రేట్‌గా, రష్యన్ జార్‌గా భావిస్తున్నాడు” అని వైట్ హౌస్ మాజీ జాతీయ భద్రతా సలహాదారు ఫియోనా హిల్ అభిప్రాయపడ్డారు.

Read Also: Lok Sabha Polls: హైదరాబాద్ లోక్ సభ ఎన్నికలకు సర్వం సిద్ధం..!

ఈ ఏడాది మార్చిలో జరిగిన ఎన్నికల్లో పుతిన్‌ రికార్డు స్థాయిలో 87.8 శాతం ఓట్లు పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరుసగా ఐదోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పుతిన్‌ 2030 వరకు అధ్యక్షుడిగా కొనసాగితే 30 ఏళ్ల పాటు రష్యాను పాలించిన నాయకుడిగా రికార్డును సృష్టించనున్నారు. గతంలో జోసఫ్‌ స్టాలిన్‌ 29 ఏళ్ల పాటు రష్యా అధ్యక్షుడిగా కొనసాగారు. కమ్యూనిజం విప్లవం రాకముందు రాణి కేథరిన్‌ ది గ్రేట్‌ 34 ఏళ్ల పాటు రష్యాను పాలించారు. ఇక 2018లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రష్యాను టాప్‌-5 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా చేస్తానని పుతిన్‌ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌తో పోరు, పశ్చిమ దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షలతో మాస్కో ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో రానున్న ఆరేళ్లల్లో పుతిన్‌ ఏమి చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.