ముస్లిం యువతులు పదహారేళ్లకే పెళ్లి చేసుకోవచ్చు.. కోర్టు సంచలన తీర్పు!

  • Written By:
  • Publish Date - June 20, 2022 / 05:31 PM IST

తాజాగా ముస్లిం యువత పెళ్లి గురించి పంజాబ్, హర్యానా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మామూలుగా ప్రస్తుతం అమ్మాయి, అబ్బాయి వివాహ వయసు 20 ఏళ్ళు దాటాక చెయ్యాలి అని గతంలో హైకోర్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ పంజాబ్, హర్యానా కోర్టు మాత్రం ముస్లిం యువతి 16 ఏళ్లు నిండగానే తనకు ఇష్టమైన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు అంటూ తీర్పు ఇచ్చింది.

షరియా చట్టం ప్రకారం 16 ఏళ్లు నిండిన ముస్లిం యువతులు తమకు ఇష్టమైన వారిని పెళ్లి చేసుకునే హక్కును కలిగించింది. మొత్తానికి 16 ఏళ్లు నిండగానే పెళ్లి చేసుకునేందుకు అర్హురాలే అని ఇందులో ఎటువంటి క్రైమ్ లాంటి లేదు అని తేల్చి చెప్పేసింది. తాజాగా పదహారేళ్లు నిండిన ఓ యువతి తనకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకొని తమకు రక్షణ కల్పించాలని అంటూ పంజాబ్, హర్యానా కోర్టును ఆశ్రయించిందని తెలిసింది.

దీంతో ప్రతి పిటిషన్ పై కోర్టులో సోమవారం రోజు విచారణ జరగటంతో హైకోర్టు షరియా చట్టాన్ని దృష్టిలోకి తీసుకొని వారి వివాహాన్ని ఒప్పుకుంది. అంతేకాకుండా ముస్లిం యువతి తనకు ఇష్టమైన వ్యక్తిని పెళ్ళి చేసుకునే హక్కు కూడా ఉంది అని హైకోర్టు క్లియర్ గా చెప్పేసింది. ప్రస్తుతం ఈ చట్టంను పలుచోట్ల లో కొందరు ప్రజలు అంగీకరించటానికి ఇష్టపడక పోగా.. మరి కొందరు మాత్రం ఇది కరెక్ట్ సలహా అని అంటున్నారు.