PUBG Love: పబ్ జీ ప్రేమకథ.. ప్రియుడి కోసం ఇండియాకు వచ్చిన పాకిస్థాన్ మహిళ!

గ్రేటర్ నోయిడాలో గత సోమవారం ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Written By:
  • Updated On - July 5, 2023 / 04:55 PM IST

భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య కొన్ని విషయాల్లో శతృత్వం ఉండొచ్చు. కానీ ప్రేమకు హద్దుల్లేవు అని నిరూపించింది ఓ జంట. పబ్ జీ అనే గేమ్ ద్వారా పరిచయం అయిన ఈ కపుల్స్ ఆ తరువాత పెళ్లి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇదంతా కామన్ గా జరిగేదే. కానీ ఇక్కడో ట్విస్ట్ ఉంది. అమ్మాయి పాకిస్తాన్ జాతీయురాలు. అంతేకాకుండా ఆమెకు నలుగురు పిల్లలు. ఫైనల్ గా చెప్పేదేంటంటే అమె అక్రమంగా ఇండియాలో చొరపబడ్డారు. గ్రేటర్ నోయిడాలో గత సోమవారం ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె భారత్ లో అక్రమంగా ప్రవేశించిన గూఢాచారి అని భావించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

పాకిస్తాన్ కు చెందిన సీమా గులాం హైదర్ అనే మహిళ కు సౌదీ అరేబియాలో పనిచేసే ఓ పాకిస్తాన్ కు చెందిన వ్యక్తితో వివాహమైంది. వీరికి నలుగురు పిల్లలు జన్మించారు. అయితే సీమా గులాం నిత్యం భర్త నుంచి వేధింపులు ఎదుర్కోనేది. ఈ క్రమంలో నాలుగేళ్లుగా అతనిని కలుసుకోలేదు. ఇదే సమయంలో పబ్ జీ ఆడే అలవాటు ఉన్న హైదర్ కు 2019లో భారత్ లోని నోయిడాకు చెందిన సచిన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత ఇన్ స్ట్రాగ్రామ్, వాట్సాప్ ద్వారా వీరు చాటింగ్ చేసుకునేవారు. కొంతకాలం వీడియో కాలింగ్ కూడా చేసుకున్నారు. ఆ తరువాత ఇండియాకు రావడానికి హైదర్ రెడీ అయింది. అయితే ఇండియాకు ఎలా రావాలో యూట్యూబ్ ద్వారా తెలుసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ముందుగా ఆమె 2023 మార్చిలో షార్జాకు వెళ్లారు. ఆ తరువాత ఖాడ్మాండ్ లో ప్రవేశించారు. నేపాల్ లో సీదర్ తో పాటు నోయిడాకు చెందిన ఆమె ప్రియుడు సచిన్ కలుసుకున్నారు. వీరిద్దరు కలిసి ఏడు రోజుల పాటు ఓ హోటల్ లో నివసించారు. ఆ తరువాత నలుగురు పిల్లలతో కలిసి టూరిస్ట్ వీసాపై రావడానికి తిరిగి పాకిస్తాన్ కు వెళ్లింది హైదర్. కొన్ని రోజుల తరువాత అక్రమంగా ఇండియాలో ప్రవేశించడానికి రూట్ ను కొనుగొని ఇండియాలో ప్రవేశించింది. గత మే నెలలో ఎంట్రీ ఇచ్చిన హైదర్ ఆమె ప్రియుడితో కలిసి నోయిడాలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అయితే ఆ ఆపార్టమెంట్ యజమాని బ్రీజేస్ కు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు. అసలు విషయం బయటపడడంతో హైదర్ ను అరెస్టు చేశారు.