YS Jagan : గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. ఆయన పర్యటనపై దళిత, ప్రజాసంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసన నిర్వహించాయి. తెనాలికి సమీపంలోని ఐతా నగర్‌లో జగన్ రౌడీషీటర్లను పరామర్శించేందుకు వస్తున్నారన్న వార్తలపై ఈ సంఘాలు తీవ్రంగా స్పందించాయి. దీనిపై నిరసనగా నల్ల బెలూన్లతో మండల కేంద్రంలో ప్రదర్శనలు నిర్వహించాయి. జగన్ కాన్వాయ్ చేరిన సమయంలో సంఘాల నేతలు వ్యతిరేక నినాదాలు చేశారు. జగన్ పర్యటనపై దళిత సంఘాలు “రౌడీల పర్యటనకు రాకూడదు” దళితులపై దాడులు చేసిన వారిని పరామర్శించడమేంటీ?” అనే మాటలతో ప్రశ్నించాయి. సమాజాన్ని భయపెట్టే వ్యక్తులతో మమేకం కావడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెనాలిలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో జగన్ పర్యటనకు తీవ్ర రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.
Read Also: Canada : భారత్‌ను టార్గెట్ చేసేవారితో సంబంధాలు తెంచుకోవాలి: కెనడా మాజీ ప్రధాని
ఇటీవల తెనాలిలో దళిత మరియు మైనారిటీ వర్గాలకు చెందిన యువకులపై పోలీసుల దాడి జరిగినట్లు ఆరోపణలు రావడం, దీనిపై వివిధ సంఘాల స్పందన జనం మధ్య పెద్ద చర్చకు దారి తీసింది. ఏప్రిల్ 25న తెనాలి పట్టణంలో జాన్ విక్టర్, కరీముల్లా, రాకేష్ అనే ముగ్గురు యువకులపై గంజాయి కలిగి ఉన్నారన్న అనుమానంతో పోలీసులు దారుణంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. వీరు దళిత, మైనారిటీ వర్గాలకు చెందిన వారు కావడం, వాటిని బలంగా తీసుకొని పోలీసుల తీరుపై ప్రజలు గళమెత్తుతున్నారు. అంతేగాక, ఈ దాడి సంఘటనకు సంబంధించిన వీడియో మే 26న సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మొత్తం విషయంపై రాష్ట్రవ్యాప్తంగా దృష్టి పడింది. వీడియోలో వీరు రద్దీగా ఉండే రోడ్డుపై అందరూ చూస్తుండగానే లాఠీచార్జ్‌కు గురైన దృశ్యాలు కలకలం రేపాయి. ఈ ఘటనపై పోలీసుల తీరు, ప్రభుత్వ స్పందనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో జగన్ తెనాలికి రాక, అక్కడ జరిగిన దాడులకు పాల్పడ్డవారిని పరామర్శించడంపై వస్తున్న విమర్శలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. పోలీసులు దాడి చేసిన వారిని, గంజాయి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని పరామర్శించడం వలన దళిత వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడినట్లు తెలుస్తోంది. జగన్ పర్యటనపై స్పందించిన దళిత సంఘాల నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, “రౌడీలకు మద్దతుగా జగన్ ఎందుకు వెళ్తున్నారు?” అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. సామాన్య ప్రజల సమస్యలపై స్పందించకుండా, నేరచరితమున్నవారిని పరామర్శించడమేంటని వారు విమర్శిస్తున్నారు. పర్యటన సందర్భంగా జరిగిన నిరసనలు, నినాదాలు వైసీపీకి స్థానికంగా చుక్కెదురయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also: Operation Sindoor : భారత్ కొట్టిన టార్గెట్లు ఎక్కువ… పాకిస్తాన్ ప్రూఫ్స్ రివీల్