Site icon HashtagU Telugu

Professor Saibaba: నాగ్‌పూర్ జైలు నుంచి రిలీజైన ప్రొఫెస‌ర్ సాయిబాబ‌

Professor Saibaba Was Relea

Professor Saibaba Was Relea

 

Professor Saibaba: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా ఈరోజు నాగ్‌పూర్ సెంట్రల్ జైలు(Nagpur Central Jail) నుంచి విడుదలయ్యారు(released). మావోయిస్టుల తో సంబంధాలు ఉన్నాయన్న కేసులో(Maoist Links Case) ఆయన నిర్దోషి అని బాంబే హైకోర్టు(Bombay High Court)రెండు రోజుల క్రితం తీర్పునిచ్చింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని ట్రయల్ కోర్టు సాయిబాబా కేసులో అప్పట్లో విచారణ జరిపిన విషయం తెలిసిందే.

మహారాష్ట్ర పోలీసులు(Maharashtra Police) 2014లో సాయిబాబాను అరెస్టు చేశారు. పలు సెక్షన్ల కింద ఛార్జ్‌షీట్‌ నమోదు చేశారు. 2017లో గడ్చిరోలి జిల్లా సెషన్స్‌కోర్టు తీర్పు ఇస్తూ సాయిబాబాతో పాటు మరో అయిదుగురికి జీవిత ఖైదు విధించింది.

అనంతరం ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్‌ ఉద్యోగాన్ని కూడా సాయిబాబా కోల్పోయారు. అయితే, ఆ తీర్పుపై సాయిబాబా అప్పీల్‌కు వెళ్లారు. యూఏపీఏ కేసులో నియమ నిబంధనలను పోలీసులు సరిగా పాటించలేదంటూ బాంబే హైకోర్టు 2022లోనే సాయిబాబాపై కేసును కొట్టివేసింది.

We’re now on WhatsApp. Click to Join.

ఆ తర్వాత మహారాష్ట్ర సర్కారు(Maharashtra Govt) ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వెళ్లింది. దీంతో సాయిబాబా విడుదలపై అప్పట్లో స్టే పడింది. సాయిబాబా కేసును తిరిగి వినాలంటూ బాంబే హైకోర్టుకు సూచించింది. విచారించిన బాంబే హైకోర్టు సాయిబాబా సహా మొత్తం ఆరుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ విడుదల చేయాలని ఆదేశించింది.

read also: Kohli IPL Participation: విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో ఆడ‌తాడా..?