Site icon HashtagU Telugu

Priyanka Gandhi : లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక పోటీ కష్టమేనా?.. అమేథీ బరిలోకి రాహులేనా?

Priyanka competition in the Lok Sabha elections difficult?.. Is Rahul in Amethi?

Priyanka competition in the Lok Sabha elections difficult?.. Is Rahul in Amethi?

Priyanka Gandhi: కాంగ్రెస్‌(Congress) పార్టీ నాయకురాలు ప్రియాంకగాంధీ(Priyanka Gandhi) రానున్న లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections)బరి నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ(Amethi), రాయ్‌బరేలీ(rae bareli) లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఎవరనే అంశంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా అమేథీ నుంచి రాహుల్‌ గాంధీ, రాయ్‌బరేలీ నుండి ప్రియాంక పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

అయితే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని ప్రియాంక గాంధీ నిర్ణయించుకున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి. కేవలం ఒక సీటు నుంచి పోటీ చేయకుండా.. తాను దేశమంతా ప్రచారం చేస్తేనే పార్టీకి మంచి ఫలితాలొస్తాయని ఆమె భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. అంతేగాక, తాను పోటీ చేస్తే వారసత్వంపై విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్‌ నాయకురాలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. అందుకే, ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగకుండా విస్తృత ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మే 3వ తేదీ నుంచి ఆమె యూపీలో ప్రచారం ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

Read Also: UGC NET 2024: అలర్ట్.. ఈ పరీక్ష తేదీల్లో మార్పులు, కార‌ణం ఏంటంటే..? 

మరి, ప్రియాంక ఎన్నికలకు దూరంగా ఉంటే రాయ్‌బరేలీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే సందిగ్ధత నెలకొంది. ఇక్కడ కూడా రాహుల్‌ గాంధీ పేరే వినిపిస్తోంది. అమేఠీ లేదా రాయ్‌బరేలీ నుంచి ఆయన పోటీపై 24 గంటల్లో హైకమాండ్‌ నిర్ణయం తీసుకోనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు అమేఠీ నుంచి పోటీ చేసేందుకు ప్రియాంక భర్త రాబర్ట్‌ వాద్రా ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే.

Read Also: Prizes For Voters : ఓటర్లకు లక్కీ డ్రా.. డైమండ్ రింగ్, ల్యాప్‌టాప్ గెల్చుకునే ఛాన్స్

ఈ రెండు స్థానాలకు ఐదో విడతలో భాగంగా మే 20వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లు సమర్పించేందుకు మే 3 చివరి తేదీ. నేడు లేదా రేపు కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. ఈ రెండు చోట్ల అభ్యర్థులపై తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగించినట్లు కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సోమవారం వెల్లడించింది.