Site icon HashtagU Telugu

Priyanka Chopra Baby: కూతురు ఫొటోను రిలీజ్ చేసిన గ్లోబల్ బ్యూటీ..!!

priyanka baby

priyanka baby

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన కూతురును పరిచయం చేసింది. తన కూతురు మాల్తీమేరీని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రియాంక చోప్రా. అయితే చిన్నారి ముఖం మాత్రం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంది. భర్త నిక్ జోనాస్ తోపాటు తన కూతురును గుండెకు హత్తుకుని.. మాతృత్వపు అనుభూతులు…పొందుతూ దిగిన ఫొటోను పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కూతురు ఫొటోను షేర్ చేస్తూ…ప్రియాంక ఎమోషన్ కామెంట్స్ చేశారు. వందరోజులకుపైగా ఎన్ఐసీయూ లో గడిపిన తర్వాత మా అమ్మాయి ఇంటికొచ్చింది..అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ప్రతి ఫ్యామిలీ ప్రయాణం ఎంతో ప్రత్యేకమైంది. దానికి ఒక నిర్దిష్టమైన విశ్వాసం చాలా అవసరం. మాది కొన్ని నెలలు సవాలుగా సాగినప్పటికీ…పునరాలోచనలో స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఎంతో విలువైంది…ప్రతిక్షణం పరిపూర్ణంగా ఉంటుందని పేర్కొంది. కూతురు తమ జీవితంలోకి వచ్చాక కలిగే ఫీలింగ్స్ ను ప్రియాంక పేర్కొంది. ప్రియాంక తమ జీవితంలోకి కూతురును ఆహ్వానిస్తూ…జనవరిలో పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే సరోగసీ ద్వారా తాము కూతురును కనబోతున్నట్లు పేర్కొంది ప్రియాంక.

 

Exit mobile version