PM Modi : సౌదీలో పర్యటించనున్న ప్రధాని మోడీ

కొద్ది రోజుల క్రితం సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ భారత ప్రధాని మోడీని కలిసినప్పుడు సౌదీ అరేబియాలో పర్యటించాలని ఆహ్వానం పలికారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ  సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు.

Published By: HashtagU Telugu Desk
Prime Minister Modi to visit Saudi Arabia

Prime Minister Modi to visit Saudi Arabia

PM Modi : రెండు రోజుల పాటు సౌదీ అరేబియాలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రధాని 2025 ఏప్రిల్ 22-23 తేదీల్లో సౌదీ అరేబియా పర్యటనకు బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఇంధన భద్రత, రక్షణ, మరియు ద్వైపాక్షిక సహకారం వంటి అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ పర్యటన కంటే ముందుగా 2016 మరియు 2019లో మోడీ సౌదీ అరేబియాను సందర్శించారు. కాగా, కొద్ది రోజుల క్రితం సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ భారత ప్రధాని మోడీని కలిసినప్పుడు సౌదీ అరేబియాలో పర్యటించాలని ఆహ్వానం పలికారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ  సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు.

Read Also: Inter results : 22న తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు

ఈ పర్యటన భారత్-సౌదీ అరేబియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (IMEC) వంటి ప్రాజెక్టుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకొనున్నట్లు తెలుస్తుంది. ఇక, ఈ పర్యటన ద్వైపాక్షిక సహకారాన్ని కొత్త దశకు తీసుకెళ్లేలా ఉండనుందని, ప్రపంచ రాజకీయాలలో భారత్‌కు ఉన్న ప్రాధాన్యతను ఈ సందర్శన మరోసారి హైలైట్ చేయనుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాగా, 2024 లో డిసెంబర్ నెలలో సౌదీ ప్రిన్స్ ఆహ్వానం మేరకు ప్రధాని అక్కడకు వెళ్లాల్సి ఉండగా.. అది షెడ్యూల్ విభేదాల కారణంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీంతో తాజాగా తిరిగి మరో షెడ్యూల్ ఖరారు కావడంతో ప్రధాని మోడీ సౌదీలో కీలక పర్యటన చేయనున్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం మరియు సౌదీ అరేబియా మధ్య మొత్తం సంబంధాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. గల్ఫ్ దేశంలో 2.6 మిలియన్ల మంది భారతీయులు ఉన్నారు మరియు ఇది రెండు దేశాల మధ్య సంబంధానికి కీలకమైన స్తంభంగా పరిగణించబడుతుంది. భారతదేశం-సౌదీ అరేబియా సంబంధాలలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడంలో ప్రధానమంత్రి మోడీ ఏప్రిల్ 2016లో రియాద్ పర్యటన ముఖ్యమైనదిగా పరిగణించబడింది. సంవత్సరాలుగా ద్వైపాక్షిక వాణిజ్యం క్రమంగా పెరిగింది. భారతదేశం సౌదీ అరేబియాకు రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి.

Read Also: Naxal Free Village: మావోయిస్టురహితంగా ‘బడేసట్టి’.. ఛత్తీస్‌గఢ్‌లో కీలక పరిణామం

 

 

  Last Updated: 19 Apr 2025, 02:50 PM IST