Pm Modi : దశాశ్వమేథ ఘాట్‌లో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు

Prime Minister Modi special pooja: ప్రధాని మోడీ ఈరోజు వారణాసిలో లోక్‌సభ ఎన్నికల కోసం నామినేషన్‌ వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గంగా నది తీరంలో ఉన్న దశాశ్వమేథ ఘాట్‌(Dashashwamedh Ghat)లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛ‌ర‌ణ‌ల మ‌ధ్య మోడీ గంగా హార‌తి నిర్వ‌హించారు. దేశ సంక్షేమం కోసం గంగా పూజ చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. మూడవ సారి మోడీ ప్రధాని కావాలని, దేశ ప్రఖ్యాతలు ప్రపంచవ్యాప్తంగా వెలిగిపోవాలని కోరుకున్నట్లు పూజారి రామణ్‌ అన్నారు. […]

Published By: HashtagU Telugu Desk
Prime Minister Modi special pooja at Dashashwamedh Ghat

Prime Minister Modi special pooja at Dashashwamedh Ghat

Prime Minister Modi special pooja: ప్రధాని మోడీ ఈరోజు వారణాసిలో లోక్‌సభ ఎన్నికల కోసం నామినేషన్‌ వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గంగా నది తీరంలో ఉన్న దశాశ్వమేథ ఘాట్‌(Dashashwamedh Ghat)లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛ‌ర‌ణ‌ల మ‌ధ్య మోడీ గంగా హార‌తి నిర్వ‌హించారు. దేశ సంక్షేమం కోసం గంగా పూజ చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. మూడవ సారి మోడీ ప్రధాని కావాలని, దేశ ప్రఖ్యాతలు ప్రపంచవ్యాప్తంగా వెలిగిపోవాలని కోరుకున్నట్లు పూజారి రామణ్‌ అన్నారు. మ‌రో పూజారి సంతోష్ నార‌య‌న్ తెలిపారు. ద‌శాశ్వ‌మేథ ఘాట్‌లో పూజ‌లు నిర్వ‌హించిన త‌ర్వాత‌.. ప్ర‌ధాని మోడీ ప్ర‌త్యేక క్రూయిజ్ బోట్‌లో విహ‌రించారు.

కాగా, నామినేష‌న్ దాఖ‌లు సంద‌ర్భంగా కేంద్ర మంత్రులు షా, రాజ్‌నాథ్‌, బీజేపీ ముఖ్య‌మంత్రులు హాజ‌రుకానున్నారు. సోమ‌వారం రాత్రి ప్ర‌ధాని మోదీ .. కాశీ విశ్వేశ్వ‌రుడి ద‌ర్శ‌నం చేసుకున్నారు. ఇవాళ ఆయ‌న నామినేష‌న్ ఫైల్ చేయ‌డానికి ముందు కాల‌భైర‌వుడిని కూడా ద‌ర్శించుకోనున్నారు. నామినేషన్ వేశాక, రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్లో పార్టీ కార్యకర్తలతో ప్రధాని మోడీ భేటీ కానున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మోడీ నామినేషన్ కార్యక్రమానికి హాజరుకానున్నారు పలువురు ప్రముఖులు. బీజేపీ పాలిత రాష్ట్రాల 12 మంది ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు మోదీ నామినేషన్ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన నేతలు జయంత్ చౌదరి (ఆర్ఎల్డీ), చిరాగ్ పాశ్వాన్ (ఎల్జేపీ), అనుప్రియ (అప్నాదళ్), ఓంప్రకాశ్ రాజ్‌భర్ (సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ), పవన్ కళ్యాణ్ (జనసేన) చంద్రబాబు(టిడిపి) మోడీ నామినేషన్ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

Read Also: IPL 2024 Tickets: అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. నేటి నుంచి అందుబాటులోకి IPL ప్లేఆఫ్ టిక్కెట్‌లు..!

 

  Last Updated: 14 May 2024, 11:19 AM IST