PM Modi : వద్వాన్ పోర్టుకు ప్రధాని మోడీ శంకుస్థాపన

ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం సుమారు రూ. 76 వేల కోట్లు ఖర్చుపెట్టబోతున్నారట. వీటితోపాటు 1560 కోట్ల విలువైన 218 ఫిషరీస్ ప్రాజెక్టులను కూడా ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు.

Published By: HashtagU Telugu Desk
Prime Minister Modi laid foundation stone for Vadhavan Port

Prime Minister Modi laid foundation stone for Vadhavan Port

PM Modi: ప్రధాని మోడీ ఈరోజు మహారాష్ట్రలో పర్యటించారు. ఈ సందర్భంగా పాల్ఘర్ లోని వద్వాన్ పోర్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం సుమారు రూ. 76 వేల కోట్లు ఖర్చుపెట్టబోతున్నారట. వీటితోపాటు 1560 కోట్ల విలువైన 218 ఫిషరీస్ ప్రాజెక్టులను కూడా ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్రంలోని పాల్ఘర్ లో శుక్రవారం వద్వాన్ నౌకాశ్రయానికి ప్రధాని మోడీ శంకుస్థాపన కార్యక్రమం చేశారు. ఈ నౌకశ్రయాన్ని రూ.76 వేల కోట్ల నిధులతో నిర్మించనున్నారు. ఈ భారీ జలాంతర్గత పోర్ట్ భారత్‌లోనే అతిపెద్ద కంటైనర్ పోర్ట్. అయితే ఈ పోర్ట్ నిర్మాణానికి వద్వాన్ గ్రామస్తులు, బందర్ విరోధి సంఘర్శ సమితి సభ్యులు, స్థానిక మత్స్యకారులు అప్పట్లో తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. ఈ పోర్ట్ నిర్మాణం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, అంతేకాదు, మత్స్యకారుల జీవనోపాధిపై కూడా దెబ్బపడుతుందని మత్య్స కారులు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. 1997 లోనే మహారాష్ట్ర ప్రభుత్వం వద్వాన్ పోర్ట్ ప్రతిపాదనలు చేసింది.

అయితే, పాల్ఘర్ గ్రామస్తులు ఈ నిర్మాణానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు తెలిపారు. దాంతో ఈ ప్రాజెక్టు కాస్త ఆదిలోనే ఆగిపోయింది. కానీ ఇప్పడు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సాగర్ మాల’ ప్రొజెక్టులో భాగంగా తిరిగి వద్వాన్ పోర్ట్ ఏర్పాటుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇర. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం, ఏక్ నాథ్ షిండే, గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ తో పాటు పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు.

Read Also: Viral: ప్రభుత్వ వాటర్ ట్యాంక్‌లో 25 పాములు

  Last Updated: 30 Aug 2024, 04:43 PM IST