PM Modi:దేశ వ్యాప్తంగా రాఖీ వేడుకలు (Rakhi celebrations) ఘనంగా జరుగుతున్నాయి. గ్రామాల్లో, పట్టణాల్లో సందడి వాతావరణం నెలకొంది. తాజాగా రక్షాబంధన్ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి వేడుకలు జరుపుకొన్నారు. చిన్నారులతో రాఖీ కట్టించుకుని వారితో సమయాన్ని గడిపారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, ఢిల్లీ పాఠశాల విద్యార్థులు సోమవారం ఉదయం ప్రధాని నివాసానికి వెళ్లారు. పలువురు చిన్నారులు ప్రధాని మోడీకి రాఖీలు కట్టారు. చిరునవ్వులు చిందిస్తూ.. చిన్నారులు ఎంతో ప్రేమతో మోడీ రక్షాబంధన్ కట్టారు. మోడీ తన తల్లి వద్ద కూర్చొని ఉన్న ఫోటోతో ప్రత్యేకంగా తయారు చేసిన రాఖీని ప్రధానికి ఒక చిన్నారి ప్రత్యేకంగా కట్టింది. దాన్ని చూసిన మోడీ సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులంతా రాఖీలు కట్టిన తర్వాత.. ప్రధాని నరేంద్ర మోడీ వారితో సరదాగా కాసేపు ముచ్చటించారు. అయితే.. రాఖీలు కడుతున్న సమయంలోనే ఆ విద్యార్థినుల పేర్లు.. ఏ తరగతి చదువుతున్నారనేది ప్రధాని నరేంద్ర మోడీ అడిగి తెలుసుకున్నారు.
Read Also: SC Sub Classification: ఎస్సీ-ఎస్టీ వర్గీకరణ చట్టబద్దతపై గళం విప్పిన కటుకూరి శేఖర్
రక్షాబంధన్ సందర్భంగా అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. అక్కా – తమ్ముళ్లు, అన్నా – చెల్లెళ్ల మధ్య అవినాభావ సంబంధాలకు, అపారమైన ప్రేమకు ఈ పండుగ నిదర్శనమన్నారు. ఈ పవిత్ర పండుగ ప్రజల జీవితాల్లో ఆప్యాయతలను, సామరస్య భావాలను బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షిస్తూ.. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
చెల్లికి శుభాకాంక్షలు తెలిపిన రాహుల్..
లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీకి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. “సోదర సోదరీమణుల మధ్య విడదీయరాని ప్రేమ, అనురాగాలను తెలియజేసే పండుగ రక్షాబంధన్. దేశ ప్రజలకు రాకీ పండుగ శుభాకాంక్షలు. రక్షా బంధన్ ఎల్లప్పుడూ మీ పవిత్ర బంధాన్ని దృఢంగా ఉంచాలని కోరుకుంటున్నా ” అని రాహుల్ ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
Read Also: Champai Soren : ‘‘మీరొక పులి.. ఎన్డీయేలోకి స్వాగతం’’.. చంపై సోరెన్‌కు ఆహ్వానం