Site icon HashtagU Telugu

Maldives : భారతీయ టూరిస్టులకు మాల్దీవుల అధ్యక్షుడు ప్రత్యేక విజ్ఞప్తి

President of Maldives makes a special appeal to Indian tourists

President of Maldives makes a special appeal to Indian tourists

President Mohamed Muizzu : నాలుగు రోజుల పర్యటన కోసం మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు భారత్‌కు విచ్చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థతో ముయిజ్జు మాట్లాడుతూ.. ఇండియన్ టూరిస్టుల తమ దేశంలో పర్యటించాలని కోరారు. వారు తమ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపిస్తారని తెలిపారు. అలాగే, భారత భద్రతను బలహీనపరిచేలా మాల్దీవులు ఎప్పటికి వ్యవహరించదని హామీ ఇచ్చారు. అలాగే, ఢిల్లీ మాకు విలువైన భాగస్వామి అని ఆయన కొనియాడారు. ఇక, రక్షణ సహా ఇతర రంగాల్లో ప్రాధాన్యం ఉండబోతుంది.. మేం వివిధ రంగాల్లో ఇతర దేశాలతో సహకారాన్ని పెంపొందించుకుంటున్నారు.. మా చర్యలు మా ప్రాంత భద్రత, స్థిరత్వంపై రాజీ లేకుండా ఉండేలా చూసుకుంటామని మహ్మద్ ముయిజ్జు ప్రకటించారు.

Read Also: Amit Shah : 2026 నాటికి నక్సలిజాన్ని నిర్ములించాల్సిందే : అమిత్‌ షా

ఇక, మా పొరుగు దేశాలు, స్నేహితులపై గౌరవంతో వ్యవహరించడం మా డీఎన్‌ఏలో ఉందని మాల్దీవుల అధ్యక్షు ముయిజ్జు వెల్లడించారు. అలాగే, మాల్దీవ్స్ ఫస్ట్‌ విధానం గురించి ప్రస్తావిస్తూ.. అంతర్జాతీయ సంబంధాల్లో వైవిధ్యతను చూపడం మాల్దీవులకు చాలా అవసరం అని చెప్పుకొచ్చారు. అలాగే, ఏ ఒక్క దేశం పైనా అతిగా ఆధారపడటం తగ్గించుకోవాల్సి ఉందన్నారు. దీని వల్ల భారత ప్రయోజనాలు దెబ్బతినవని పేర్కొన్నారు. ఈ సందర్భంగానే భారత టూరిస్టులకు ముయిజ్జు స్వాగతం పలికారు.

Read Also: Sunita Williams: అంతరిక్షం నుంచి ఓటు వేయనున్న సునీతా విలియమ్స్

మరోవైపు మహ్మద్ ముయిజ్జు అక్టోబర్‌ 10 వరకు భారత్‌లో పర్యటించనున్నారు. ఇటీవల ఇరు దేశాల మధ్య ఏర్పడిన దౌత్య విభేదాల తర్వాత.. మాల్దీవుల అధినేత ముయిజ్జు భారత్‌కు రావడం ఇది రెండోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఇతర దేశాధినేతలతో పాటు హాజరైనప్పటికి నుంచి ఆ దేశ వైఖరిలో మార్పు వచ్చినట్లు పలు సంకేతాలు వచ్చాయి. ఆ తర్వాత జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఆగస్టులో మాల్దీవుల్లో పర్యటించి ఆ దేశ అధ్యక్షుడితో చర్చించారు. అయితే, చైనా అనుకూలుడిగా పేరున్న ముయిజ్జు.. అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత తుర్కియే, చైనాలో పర్యటనలు చేశారు. ముయిజ్జు అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి భారత్‌- మాల్దీవుల సంబంధాలు క్షీణించాయి. తాజా, పర్యటన గురించి ప్రకటన వచ్చిన కాసేపటికే మోడీపై విమర్శలు చేసిన మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు.

Read Also: Delhi : పండుగల వేళ ఉగ్రదాడులు.. ఢిల్లీలో హైఅలర్ట్..!