Site icon HashtagU Telugu

Pregnant Tribal Woman : మూడున్న‌ర కి.మీ డోలీలో వెళ్లిన‌ గ‌ర్బిణీ గిరిజన మహిళ

Doli Imresizer

Doli Imresizer

కేరళలో హృద‌య‌విదార‌క సంఘ‌ట‌న చోటుచేసుకుంది. ఓ గర్భిణీ గిరిజన మహిళను ఆమె గ్రామానికి వెళ్లే రహదారి దెబ్బతినడంతో అంబులెన్స్ ఆమె వద్దకు చేరుకోకపోవడంతో ఆమె బంధువులు తాత్కాలిక డోలీపై మూడున్నర కిలోమీటర్లు తీసుకెళ్లారు. ప్రధాన రహదారిపైకి చేరుకున్న తర్వాత అంబులెన్స్ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లింది. కేరళలోని పాలక్కాడ్ ప్రాంతంలోని అట్టపాడి తాలూకాలో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమతి మురుకన్ అనే గర్భిణికి ముందుగానే కాన్పు వచ్చింది. అయితే అర్ధరాత్రి ఆమెకు నొప్పులు రావ‌డంతో… గిరిజన స్పెషాలిటీ ఆసుపత్రి నుండి తన గిరిజన గ్రామమైన కడుకుమన్నకు అంబులెన్స్‌కు బంధువులు స‌మాచారం ఇచ్చారు. అయితే అంబులెన్స్ మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రధాన రహదారికి మాత్రమే చేరుకోగలిగింది. రోడ్డు దెబ్బతినడంతో అంబులెన్స్ ఆమె గ్రామానికి చేరుకోలేకపోయింది. దీంతో గ‌ర్భిణీ సుమతి బంధువులు డోలీని త‌యారు చేసి..దాని ద్వారా ఆమెను అడవిలో మూడున్నర కిలోమీటర్లు నడిచి అంబులెన్స్ వ‌ద్ద‌కు తీసుకెళ్లారు. అనంతరం అంబులెన్స్‌ గర్భిణిని ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఆసుపత్రికి చేరుకున్న సుమతి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.