UPSC Chairman: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నూతన చైర్మన్ గా కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి ప్రీతి సుదన్(Preeti Sudan) నియమితులయ్యారు. యూపీఎస్సీ సెక్రటరీ బుధవారం విడుదల చేసిన లేఖలో ఈ విషయాన్ని వెల్లడించారు. వ్యక్తిగత కారణాల వల్ల ఇటీవల రాజీనామా సమర్పించిన డాక్టర్ మనోజ్ సోనీ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. అతని స్థానంలో ప్రీతి సూదన్ ను కమిషన్ చైర్మన్ గా రాష్ట్రపతి ఆమోదించారని యూపీఎస్సీ సెక్రటరీ లేఖలో పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, యూపీఎస్సీ చైర్మన్ గా ప్రీతి సూదన్ ఆగస్టు 1న బాధ్యతలు స్వీకరించి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు లేదా 2025 ఏప్రిల్ 29వ తేదీ వరకు చైర్మన్ హొదాలో కొనసాగనున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారిణి ప్రీతి సూదన్ 1983 బ్యాచ్ కు చెందిన అధికారిణి. యూపీఎస్సీ సభ్యురాలిగా 2022 నుంచి ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, కేంద్రలోని వివిధ మంత్రిత్వ శాఖల్లోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
ప్రీతీ సుదన్ 1989 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన మాజీ అధికారిణి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలెక్టర్ గా పనిచేశారు. ప్రభుత్వ ముఖ్యకార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ మహమ్మారి ప్రబలిన సమయంలోనూ ఆమె విశేషమైన సర్వీర్ చేశారు. ఆమె కేంద్ర ఆరోగ్య కార్యదర్శిగా పని చేసి ప్రముఖుల ప్రశంసలు దక్కించుకున్నారు.
Read Also: Rajinikanth – Prabhas : ప్రభాస్, రజినిని ఫాలో అవుతున్నాడా..?