Site icon HashtagU Telugu

Chandrayaan-3: చంద్రుడి నుండి ల్యాండర్ పంపిన పిక్స్

pragyan rover successfully roll out

pragyan rover successfully roll out

చంద్రయాన్‌-3 (Chandrayaan-3) ప్రయోగంలో భాగంగా చంద్రుడి గుట్టు విప్పడంలో ముఖ్య పాత్ర పోషించే, పరిశోధనల్లో కీలకంగా వ్యవహరించే ప్రజ్ఞాన్‌ రోవర్‌ (Pragyan Rover) చంద్రుడి ఉపరితలంపై కాలు మోపి..అక్కడి రహస్యాలను ప్రజలకు చేరవేస్తుంది. సెకనుకు ఒక్కో సెం.మీ వేగంతో ఇది ల్యాండర్‌ ర్యాంపు ద్వారా వడివడిగా బయటకు వచ్చింది.

అంతరిక్ష రంగంలో సరికొత్త ఘట్టాన్ని సృష్టిస్తూ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) బుధవారం (ఆగస్టు 23) చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ విక్రమ్ ను సున్నితంగా దింపిన సంగతి తెలిసిందే. అందులో నుంచి రోవర్ ప్రజ్ఞాన్ బయటికి వచ్చింది. ల్యాండర్ దిగిన 4 తర్వాత ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వచ్చింది. చంద్రయాన్‌ 3 ప్రయోగంలో రోవర్‌ కీలక పాత్ర పోషిస్తుంది. చందమామ మీద ఉన్న రహస్యాలను చేధించే ప్రయోగంలో ప్రజ్ఞాన్‌ రోవర్‌ సెకనుకు ఒక్క సెం.మీ వేగంతో ల్యాండర్‌ ర్యాంపు ద్వారా బయటకు వచ్చింది.

Read Also : Chandrayaan-3 Landing: చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్.. ఈ మిషన్‌లో పాల్గొన్న కంపెనీల షేర్లపై ప్రభావం..!

దీనికి సంబంధించిన విజువల్స్‌, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. రోవర్‌ బయటకు వచ్చి చాలా గంటలే అవుతున్నా.. ఇస్రో మాత్రం గురువారం ఉదయం దీని గురించి ట్వీట్‌ చేసింది. రోవర్‌ ప్రగ్యాన్‌ ల్యాండర్‌ నుంచి కిందకు దిగి.. చంద్రుడి (Moon)పై ప్రయాణం ప్రారంభించిందని ప్రకటించింది. చంద్రుని కోసం ఇండియాలో తయారైన రోవర్‌ అంటూ ట్వీట్‌ చేసిన ఇస్రో.. త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడిస్తామంది. కాకపోతే ల్యాండర్ నుంచి రోవర్ ప్రజ్ఞాన్ బయటికి వచ్చిన వీడియోలు ఇస్రో (ISRO) కమాండ్ సెంటర్ నుంచే బయటికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఏదైతేమి కానీ చంద్రుడి ఫై ఉన్న రహస్యాలు బయటకు వస్తుండడం తో ప్రజలంతా ఆసక్తిగా వాటిని చూస్తున్నారు. ఇక 14 రోజుల పాటు చంద్రుడి ఉపరితలాన్ని ప్రజ్ఞాన్‌ పరిశోధించనుంది. జులై 14న మొదలైన చంద్రయాన్ 3 యాత్ర ఆగస్టు 23 సాయంత్రం సాఫ్ట్ ల్యాండింగ్ తో ముగిసింది.