Site icon HashtagU Telugu

Delhi :ఢిల్లీ మెట్రో రైల్ ఉద్యోగి వ‌ర‌ల్డ్ రికార్డ్‌.. 16 గంట‌ల్లో!

Metro

Metro

ఢిల్లీ మెట్రోరైల్ కార్పోరేష‌న్ ఉద్యోగి ప్ర‌ఫుల్ సింగ్ గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డు సాధించాడు. అన్ని మెట్రో స్టేషన్‌లకు కేవలం 16 గంటల్లో ప్రయాణించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను నెలకొల్పినట్లు మార్చి 16న ప్రకటించారు. ప్రఫుల్ సింగ్ మొత్తం 254 స్టేషన్లకు 348 కిలోమీటర్లు కేవలం 16 గంటల రెండు నిమిషాల్లో ప్రయాణించిన మొదటి వ్య‌క్తి అని ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేష‌న్ పేర్కొంది. తాను చాలా కాలంగా ఢిల్లీ మెట్రోను ఉపయోగిస్తున్నాను కాబట్టి త‌న‌కు అన్ని లైన్ల గురించి బాగా తెలుస‌స‌ని ప్రఫుల్ సింగ్ తెలిపాడు. తానకు ఏ స్టేషన్ లైన్ నుండి ప్రారంభించాలో.. ముగించాలో అనేది ముందే ప్ర‌ణాళిక ఉంద‌ని కాబట్టి తాను రికార్డును సమయానికి ముందే పూర్తి చేయగలిగిన‌ట్లు సింగ్ తెలిపారు.