Puja Khedkar : ఢిల్లీ హైకోర్టు మాజీ ఐఏఎస్ ట్రైనీ ఆఫీసర్ పూజా ఖేద్కర్‌కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఓబీసీ, దివ్యాంగ కోటాలో లబ్ధి పొందేందుకు పూజా ఖేద్కర్ .. యూపీఎస్సీని తప్పుదోవ పట్టించినట్లు జస్టిస్ చంద్ర ధారి సింగ్ పేర్కొన్నారు. డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి ఐఏఎస్ శిక్షణకు ఎంపికైనట్లు సింగిల్ జడ్జి తెలిపారు. యూపీఎస్సీని మోసం చేయాలన్న ఉద్దేశం ఆమె ప్రయత్నంలో స్పష్టం కనిపిస్తున్నట్లు కోర్టు పేర్కొన్నది. అర్హత లేకున్నా ఆమె ఆ కోటాలో లబ్ధి పొందినట్లు తెలిపారు.
కస్టడీలోనే ఆమెపై విచారణ కొనసాగాలని ధర్మాసనం తెలిపింది. యూపీఎస్సీ వ్యవస్థనే భ్రష్టుపట్టించే రీతిలో పూజా కుట్ర పన్నిందని, ఒకవేళ ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరీ చేస్తే, అది విచారణపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నట్లు కోర్టు పేర్కొన్నది. వైకల్య సమస్యలు ఉన్నా వారి కోసం ఏర్పాటు చేసిన బినిఫిట్లను ఆమె పొందినట్లు కోర్టు తెలిపింది. ఆమె ఆర్థిక, సామాజిక బ్యాక్‌గ్రౌండ్ ఆధారంగా.. ఆమెకు పేరెంట్స్ కూడా సహకరించి ఉంటారని అంచనాకు వచ్చారు.
యూపీఎస్సీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఖేద్కర్‌పై కేసు బుక్ చేశారు. అరెస్టు చేయవద్దు అని ఆగస్టు 12వ తేదీన తాత్కాలిక రక్షణ కల్పించారు. కానీ తాజా ఆదేశాలతో ఆ తీర్పును రద్దు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం యూపీఎస్సీ ఆమె సెలక్షన్‌ను రద్దు చేసింది. భవిష్యత్తులో ఎటువంటి పరీక్ష రాయకుండా ఆమెను పర్మనెంట్‌గా డిమాండ్ చేశారు. అక్రమ రీతిలో యూపీఎస్సీ పరీక్షను ఆమె క్లియర్ చేసినట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.
కాగా, ఆమె గుర్తింపును నకిలీ చేసినందుకు దోషిగా గుర్తించిన తర్వాత ఆమె ప్రవేశ పరీక్ష రాకుండా జీవితాంతం నిషేధించింది. ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన స్టేటస్ రిపోర్టులో, మహారాష్ట్ర కేడర్ మాజీ ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారి ఖేద్కర్ తన యుపిఎస్‌సి పరీక్ష కోసం రెండు వేర్వేరు వైకల్య ధృవీకరణ పత్రాలను సమర్పించారని ఢిల్లీ పోలీసులు వాదించారు. 2022 మరియు 2023లో ఆమె చేసిన UPSC ప్రయత్నాల కోసం అహ్మద్‌నగర్ జిల్లా సివిల్ హాస్పిటల్ ‘బహుళ వైకల్యాలు’ ఉదహరిస్తూ 2018 మరియు 2021 నాటి వైకల్య ధృవీకరణ పత్రాలను జారీ చేసింది. అయితే, ఢిల్లీ పోలీసుల స్టేటస్ రిపోర్ట్ ప్రకారం, ఆసుపత్రి అధికారులు ఈ సర్టిఫికేట్‌లను క్లెయిమ్ చేయడాన్ని తిరస్కరించారు. బహుళ వైకల్యాలు’ వారి ద్వారా ఆమెకు జారీ చేయబడ్డాయి.
Read Also: Manchu family Controversy: తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబుకు షాక్.. అరెస్ట్ తప్పదా?