Constable Wins 1cr: ఆరు రూపాయిలతో కోటి రూపాయిలు గెలిచిన కానిస్టేబుల్.. ఎలా అంటే?

అదృష్టం ఎప్పుడు ఎలా వర్తిస్తుందో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఒక్కొక్కసారి అదృష్టం ఉంటే రాత్రికి రాత్రి

  • Written By:
  • Publish Date - August 7, 2022 / 06:45 AM IST

అదృష్టం ఎప్పుడు ఎలా వర్తిస్తుందో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఒక్కొక్కసారి అదృష్టం ఉంటే రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోతూ ఉంటారు. అదృష్టం కోటీశ్వరులు అంటే మనకు గుర్తుకు వచ్చేది లాటరీ. ఈ లాటరీలు తగలడం వల్ల ఎంతో మంది రాత్రికి రాత్రి కోటీశ్వరులుగా మారిపోయిన వారు ఉన్నారు. అయితే ఇప్పటికే ఎంతోమంది ఈ లిస్టులో ఉండగా తాజాగా రాజస్థాన్ కు చెందిన కానిస్టేబుల్ కూడా ఈ లిస్టులోకి చేరారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ కు చెందిన కుల్దీప్ సింగ్ అనే కానిస్టేబుల్ పంజాబ్ పోలీస్ శాఖ లో పనిచేస్తున్నాడు. ఉద్యోగం నిమిత్తం తరచుగా లుథియానాకు వెళ్లేవాడు.

అలా వెళ్లేటప్పుడు అక్కడికి రైల్వే స్టేషన్ కు సమీపంలో ఉండే ఒక ఏజెంట్ నుంచి నాగాలాండ్ లాటరీ సంస్థకు చెందిన టికెట్ ను కొనుగోలు చేసేవాడు. అయితే నిజానికి కుల్దీప్ సింగ్ కు లాటరీ కొనుగోలు చేసే అలవాటు లేదట. కానీ ఆరు నెలల క్రితం అతని తల్లి టికెట్ కొనాలని చెప్పడంతో అప్పటినుంచి కుల్దీప్ లాటరీ కోసం టికెట్ కొనడం మొదలుపెట్టాడట. ఎప్పుడు లుథియానా వెళ్లినా ఖచ్చితంగా లాటరీ టికెట్ కొనేవాడట. అయితే గతంలో ఒకసారి ఈ విధంగానే కొనుగోలు చేసి 6000 రూపాయలు గెలుచుకున్నాడట. అలా ఎప్పటికైనా ఎక్కువ మొత్తంలో డబ్బులు గెలుచుకోవాలి అన్న ఆశతో లాటరీ టికెట్లు కొనుగోలు చేసే వాడట. ఇక ఇటీవలే లూథియానా వెళ్లినప్పుడు ఆరు రూపాయల చొప్పున 150 రూపాయలకు 250 టికెట్లు కొన్నాడట. ఇక అదే రాత్రి డ్యూటీలో ఉన్న సమయంలో అతడికి టికెట్ అనే వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చిందట.

అతడు ఫోన్ చేసి లాటరీలో కోటి రూపాయలు గెలుచుకున్నారు అని చెప్పడంతో ఆ కానిస్టేబుల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక సదరు కానిస్టేబుల్ అలా లాటరీ లో గెలుచుకునే డబ్బుతో తన కొడుకుని మంచి చదువుని చదివించడంతోపాటు, పేద పిల్లల కోసం కొంత మొత్తం డబ్బు ఇస్తానని, మరికొంత డబ్బును గురుద్వారాకు విరాళంగా ఇస్తానని తెలిపాడు. నాకే ఇకపై కూడా ముందు ముందు లాటరీలు కొనుగోలు చేస్తానని, ఇలా వచ్చిన డబ్బును సామాజిక కార్యక్రమాలకు ఉపయోగిస్తారు అని చెప్పుకొచ్చారు కుల్దీప్ సింగ్.