PM Modi – Tejas : తేజస్ యుద్ధ విమానంలో ప్రధాని మోడీ

PM Modi - Tejas : మేడిన్ ఇండియా యుద్ధ విమానం ‘తేజస్’ గురించి తెలియనిది ఎవరికి !!

Published By: HashtagU Telugu Desk
Pm Modi Tejas

Pm Modi Tejas

PM Modi – Tejas : మేడిన్ ఇండియా యుద్ధ విమానం ‘తేజస్’ గురించి తెలియనిది ఎవరికి !! తాజాగా శనివారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోడీ కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) సైట్‌ నుంచి తేజస్ యుద్ధ విమానంలో గగన విహారం చేశారు. తేజస్ జెట్‌ పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఆయన స్వయంగా ఆ విమానంలో ప్రయాణించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

తేజస్ అనేది పూర్తిగా భారత దేశ టెక్నాలజీతో భారత్‌లోనే తయారు చేసిన స్వదేశీ యుద్ధ విమానం. ఇది తేలికపాటి యుద్ధ విమానం. ఇటీవలకాలంలో మన దేశం నుంచి తేజస్ యుద్ధ విమానాలను కొనేందుకు చాలా దేశాలు ఆసక్తిని కనబర్చాయి. దీనికోసం ఆర్డర్స్ ఇచ్చేందుకు కూడా ముందుకొచ్చాయి.  అమెరికాకు చెందిన రక్షణ రంగ దిగ్గజ సంస్థ GE ఏరోస్పేస్ మన దేశానికి చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)తో ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. రెండు సంస్థలు సంయుక్తంగా Mk-II-Tejas మోడల్‌కు చెందిన ఇంజన్‌లను తయారు చేయాలని డిసైడయ్యాయి. గత (2022-2023) ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుంచి ఇతర దేశాలకు విక్రయించిన రక్షణ ఉత్పత్తుల విలువ  రూ.15,920 కోట్లు. భవిష్యత్తులో తేజస్ లాంటి స్వదేశీ యుద్ధ విమానాలను మనం తయారు చేస్తే ఆ విలువ మరింత(PM Modi – Tejas)  పెరుగుతుంది. 

Also Read: Nepal – Hindu State : రాచరికం, హిందూదేశం కోసం నేపాలీల డిమాండ్.. ఎందుకు ?

  Last Updated: 25 Nov 2023, 12:56 PM IST