Kumbh Mela : త్రివేణీ సంగమంలో ప్రధాని మోడీ పుణ్యస్నానం..

ప్రయాగ్‌రాజ్‌ చేరుకున్న ప్రధాని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కూడా ఉన్నారు.

Published By: HashtagU Telugu Desk
PM Modi takes holy bath at Triveni Sangam

PM Modi takes holy bath at Triveni Sangam

Kumbh Mela : ప్రధాని మోడీ ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళా లో పాల్గొన్నారు. కొద్దిసేపటి క్రితం ఈ వేడుక జరుగుతోన్న ప్రయాగ్‌రాజ్‌ చేరుకున్న ప్రధాని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు. ఈ సందర్భంగా త్రివేణీ సంగమం వద్ద మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కూడా ఉన్నారు. ప్రధాని మోడీ మహాకుంభమేళాకు వచ్చిన సందర్భంగా అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు. త్రివేణి సంగమం వద్ద సైతం పలు జాగ్రత్తలు తీసుకున్నారు. అంతకుముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి మోడీ యమునా నదిలో బోటు షికారు చేశారు. అరైల్‌ ఘాట్‌ నుంచి సంగం ఘాట్‌ వారకూ బోటులో ప్రయాణించారు.

Read Also: Mokshagna : మోక్షజ్ఞ మొదటి సినిమా.. ఏం జరుగుతుంది..?

అనంతరం సాధు సంతువులతో సమావేశం కానున్నారు. మహా కుంభ్‌ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష కూడా నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇక, ప్రధాని మోడీ తొలుత ప్రయాగ్‌రాజ్‌ విమానాశ్రయంలో దిగిన అక్కడి నుంచి అరైల్‌ ఘాట్‌కు వెళ్లారు. ఘాట్‌ నుంచి బోటులో ప్రయాణించి మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం త్రివేణీ సంగమంలో ప్రధాని పుణ్యస్నానం ఆచరించారు. బోటులో ఆయన వెంట సీఎం కూడా ప్రయాణించారు. ఇక, ఈరోజు నుండి అమృత స్నానాలు ఉంటాయని యోగి ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో జనాలు కూడా కోట్లల్లో వస్తున్నారు. రోజుకు నాలుగు నుంచి ఐదు కోట్ల మంది జనాలు ప్రయాగ్రాజులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

కాగా, జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకూ 39 కోట్ల మంది భక్తులు నదీ స్నానాలు ఆచరించినట్లు యూపీ అధికారులు తెలిపారు. ఇక ఇవాళ ఉదయం 37 లక్షల మందికిపైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించినట్లు పేర్కొన్నారు. అందులో 10 లక్షల మంది కల్పవాసీలు కూడా ఉన్నట్లు వెల్లడించింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రారంభమైన ఈ మహా కుంభమేలా ఫిబ్రవరి 26 శివరాత్రితో ముగుస్తుంది. 45 రోజులపాటు సాగే ఈ కుంభమేళాలకు దాదాపు 50 కోట్ల మంది హాజరవుతారని యూపీ సర్కార్‌ అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసింది.

Read Also: Cow Dung : ఆవుపేడను కొనేందుకు ఈ దేశాల క్యూ.. ఎంత ధర ?

 

  Last Updated: 05 Feb 2025, 11:59 AM IST