Site icon HashtagU Telugu

Stop War : యుద్ధం ఆపండి..ఆ దేశాలకు మోడీ హితవు

Stop War

Stop War

యుద్ధాన్ని ఆపాలని (Stop War) రష్యా-ఉక్రెయిన్ దేశాలకు ప్రధాని మోడీ సూచించారు. శత్రుత్వాన్ని శత్రుత్వంతో గెలవలేమని వాటికి హితవు పలికారు. హిరోషిమాలో జరిగిన జీ-7 శిఖరాగ్ర సదస్సులో మోడీ ఇరు దేశాల యుద్ధం గురించి మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అనేది మానవీయ విలువలకు సంబంధించిన సమస్య అని మోడీ పేర్కొన్నారు. వివాదాలు, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పుడు.. చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ యుద్ధం పట్ల క్వాడ్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. దౌత్య చర్చల ద్వారా యుద్ధానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. ఇది యుద్ధాల శకం కాదనే (Stop War) ప్రధాని మోడీ మాటలను క్వాడ్ లోని మిగతా సభ్య దేశాల అధినేతలు ఉటంకించారు.

also read : Ukraine: పుతిన్‌ హత్యకు ఉక్రెయిన్‌ కుట్ర?!

ప్లాస్టిక్ రీసైకిల్  జాకెట్‌ లో మోడీ..  

ప్రధాని నరేంద్ర మోడీ రీసైకిల్ మెటీరియల్‌తో తయారు చేసిన జాకెట్‌ను ధరించి జీ-7 శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించారు. ఈ జాకెట్ ను ప్లాస్టిక్ బాటిళ్లను రీసైకిల్ చేయగా వచ్చిన మెటీరియల్ తో తయారు చేయడం విశేషం. ఇలాంటి జాకెట్లను ధరించి ప్రధాని మోడీ గతంలో బెంగళూరులో ఓ సమావేశానికి, ఓసారి పార్లమెంట్ కు వచ్చారు.  పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలియజేసేందుకు మోడీ ఈ జాకెట్ ధరించారు. దీంతో మరోసారి మోడీ డ్రెస్సింగ్ స్టైల్ చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version