PM Modi : దీపావళికి లోకల్ బ్రాండ్స్ కొనండి.. ‘నమో యాప్‌’లో సెల్ఫీని అప్‌లోడ్ చేయండి

PM Modi : దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ కీలకమైన పిలుపునిచ్చారు.

Published By: HashtagU Telugu Desk
Lok Sabha Elections

Pm Modi

PM Modi : దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ కీలకమైన పిలుపునిచ్చారు. దీపావళి వేళ ‘మేడిన్ ఇండియా’ ఉత్పత్తులనే కొనాలని కోరారు. ఆ ఉత్పత్తులతో సెల్ఫీ దిగి, వాటిని ‘నమో యాప్‌’లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ‘లోకల్ ఫర్ వోకల్’ నినాదానికి మద్దతుగా నిలిచేందుకు భారతీయులంతా ముందుకు రావాలని ప్రధాని కోరారు. ఈమేరకు ప్రధాని మోడీ బుధవారం ఒక ట్వీట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

‘‘దీపావళి ఫెస్టివల్‌ను సృజనాత్మక స్పూర్తితో మనమంతా కలిసిమెలిసి చేసుకుందాం. ఈ వేడుకలో మీ కుటుంబసభ్యులను, స్నేహితులను భాగస్వామ్యం చేయండి. భారత ఉత్పత్తులను కొనేందుకు ప్రయారిటీ ఇవ్వండి. డిజిటల్ మీడియా శక్తిని వినియోగించుకోండి’’ అని ట్వీట్‌లో ప్రధాని(PM Modi) తెలిపారు.

Also Read: Kitchen Tips : వంటగదుల్లో.. వంట సామాన్లలో.. పురుగులు, చీమలకు చెక్

  Last Updated: 08 Nov 2023, 07:31 PM IST