Bangladesh : భారత ప్రధాని నరేంద్ర మోడీ బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్‌కు లేఖ రాశారు. బంగ్లాదేశ్ 53వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని బుధవారం జరుపుకుంది. ఈ సందర్భంగానే మహమ్మద్ యూనస్‌కు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ రాశారు. ఇరుదేశాల ద్వైపాక్షిక భాగస్వామ్యానికి పునాది పడిన రోజుగా మోడీ అభివర్ణించారు. మీకు, బంగ్లా ప్రజలకు నేను బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. బంగ్లా విముక్తి యుద్ధం మన సంబంధాలకు మార్గదర్శక కాంతిగా కొనసాగుతోంది. ఇది బహువిధాలుగా అభివృద్ధి చెందింది. శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుతో పాటు ఇరువురి ప్రయోజనాలు, ఆందోళనలు పరిగణనలోకి తీసుకొని మన సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నాం. ఈరోజు మన ద్వైపాక్షిక భాగస్వామ్యానికి పునాది పడిన రోజు. ఈరోజు మన ఉమ్మడి చరిత్ర, త్యాగాలకు నిదర్శనం. అని మోడీ లేఖలో రాసుకొచ్చారు.
Read Also: YS Jagan Tweet: పవన్‌పై వైఎస్ జగన్ ఆగ్రహం.. ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది?
మార్చి 26 బంగ్లాదేశ్ నస్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా 1971లో భారత సైనిక సహాయంతో తూర్పు పాకిస్థాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించిన చారిత్రాత్మక ఘట్టాన్ని మోడీ ఈలేఖలో ప్రస్తావించారు. ప్రధాని మోడీ చరిత్రను గుర్తు చేస్తూ,1971 బంగ్లాదేశ్ విముక్తి పోరాట స్ఫూర్తిని భారతదేశం-బంగ్లాదేశ్ మధ్య గట్టి సంబంధాలకు పునాదిగా పేర్కొన్నారు. బంగ్లాదేశ్ ఆవిర్భావంలో భారతదేశం పోషించిన కీలకపాత్రను గుర్తుచేశారు. బంగ్లాబంధు షేక్ ముజిబుర్ రెహ్‌మాన్ వారసత్వాన్నితుడిచిపెట్టివేయడానికి జరుగుతున్న ప్రయత్నాల నేపథ్యంలో,మోడీ తన లేఖలో బంగ్లాదేశ్ విముక్తి పోరాటాన్ని ప్రస్తావించారు. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాబంగ్లాలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటుచేసుకున్న ఆందోళనల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు.
కాగా, మహమ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ క్రమంలోనే అక్కడున్న హిందూ మైనార్టీలపై దాడులు జరిగాయి. దీనిపై భారత్ ఎప్పటికప్పుడు తన ఆందోళనను వ్యక్తంచేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఇరుదేశాల మధ్య సంబంధాలు బలహీనపడ్డాయి. అయితే, భారత్- బంగ్లాల మధ్య సత్సంబంధాలను కొనసాగించాలని భావిస్తున్నట్లు ఇరుదేశాలు పేర్కొంటూ వస్తున్నాయి. ఇటీవల యూనస్ సైతం ఇరుదేశాల మధ్య సంబంధాలు బలంగానే ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇకపోతే..షేక్ హసీనా అధికారాన్ని వీడిన తర్వాత, బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం భారతదేశంపై ఘర్షణాత్మక వైఖరి అవలంబించడం గమనించదగిన అంశం. అయితే, పలు రంగాల్లో భారతదేశంపై ఆధారపడిన బంగ్లాదేశ్ ఇప్పుడు మళ్లీ దాని సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తోంది.
Read Also: Education System : విద్యావిధానం పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు