Site icon HashtagU Telugu

PM Modi : మిత్రుడు డోనాల్డ్ ట్రంప్‌కు హృదయపూర్వక అభినందనలు: ప్రధాని మోడీ

India

India

Donald Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖాయమైంది. అయితే ఈ ఎన్నికల్లో ట్రంప్‌ విజయంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించినందుకు హృదయపూర్వక అభినందనలు మిత్రమా అంటూ ట్వీట్ చేశారు. మిత్రుడు డోనాల్డ్ ట్రంప్‌కు హృదయపూర్వక అభినందనలు. మునుపటి మీ పాలన తరహాలో, మీ సహకారంతో భారత్ – అమెరికా సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతం కోసం ఎదురుచూస్తున్నా. ఇరుదేశాల ప్రజల అభివృద్ధి, ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం కలిసి పనిచేద్దాం” అని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

మరోవైపు ”చారిత్రాత్మక పునరాగమనానికి శుభాకాంక్షలు. మీరు వైట్‌హౌస్‌కి తిరిగిరావడం అమెరికాకు నూతన అధ్యాయం, ఇజ్రాయెల్ – అమెరికా కూటమిని మరింత శక్తివంతం చేస్తుంది” అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. కాగా, డోనాల్డ్ ట్రంప్‌కు బ్రిటన్ ప్రధాని స్టార్మర్ శుభాకాంక్షలు తెలిపారు. రానున్న సంవత్సరాల్లో మీతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నానని స్టార్మర్ అన్నారు.

అమెరికాలో ఇంకా 35 చోట్ల కౌటింగ్ కొనసాగుతోంది. ట్రంప్ గెలుపుతో రిపబ్లికన్లు సంబురాలు చేసుకుంటున్నారు. ట్రంప్ ప్రచారం, ఆయనపై జరిగిన హత్యాయత్నంతో ఆయనకు మద్దతు పెరిగింది. అంతే కాదు డిబెట్ లో పై చేయి సాధించడంతో ఆయన ముందుకు దూసుకెళ్లాడు. అయితే డెమోక్రటిక్ పార్టీ తమ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ తప్పించి కమలా హారిస్ కు అవకాశం ఇచ్చింది.

Read Also: 2024 US Elections : ట్రంప్ విజయం..ఐటీకి మంచి రోజులు రాబోతున్నాయా..?