Sri Lanka New President: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష నేత అనుర కుమార దిస్సనాయకే ఎన్నికయ్యారు. ఆ దేశానికి వామపక్షనేత అధ్యక్షుడు కావడం ఇదే తొలిసారి. దీంతో ఆయనకు దేశ విదేశాల నుంచి శుభాకాక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోడీ, ప్రధాన పత్రిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు దిస్సనాయకేకి ఎక్స్ వేదికగా సోమవారం అభినందనలు తెలిపారు.
Read Also: Actor Simbu OG : పవన్ సినిమాలో పాట పాడిన శింబు..
కాగా, ‘శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినందుకు మీకు నా ప్రత్యేక అభినందనలు. భారత్ పొరుగు దేశమైన శ్రీలంక ఫస్ట్ పాలసీ అండ్ విజన్ సాగర్ (సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్.. ప్రాంతంలోని అందరికీ భద్రత మరియు వృద్ధి)కు ప్రత్యేక స్థానం ఉంది. మన ప్రజలు, మొత్తం ప్రాంత ప్రయోజనాల కోసం మన బహుముఖ సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి, మీతో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను’ అని మోడీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ‘డెమోక్రటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైనందుకు అనుర కుమార దిస్సనాయకెకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున నా హృదయక పూర్వక అభినందనలు. శ్రీలంక, భారత్ దేశాల మధ్య ఉన్న బహుముఖ సహకారం, పరస్పర చర్యలు గొప్ప వారసత్వాన్ని కలిగి ఉన్నాయి. ఇది శతాబ్దాల నాటిది. భారత దేశ ప్రజలు మన ప్రాంత ప్రయోజనాల కోసం, మన సంబంధాలను, భాగస్వామ్య విలువలను బలోపేతం చేయడానికి ఎదురుచూస్తున్నారు’ అని ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.