Plus Size Model: మిస్ యూనివర్స్ పోటీల్లో ప్లస్ సైజ్ బ్యూటీ, అందం హద్దులు చెరిపేసిన యువతి

అందానికి సైజు ముఖ్యమని భావించే వారు ఆ ఆలోచనను మార్చుకోవాలని చెప్పింది.

Published By: HashtagU Telugu Desk
Plus Size

Plus Size

Plus Size Model: విశ్వ సుందరి పోటీలు అనగానే జీరో సైజు తో జిగేల్ మనిపించే బ్యూటీలు, ఆకట్టుకునే ఫిజిక్, వాక్ చాతుర్యం కట్టిపడేసే అందాల మహిళలు గుర్తుకువస్తారు. కానీ ఇటీవల జరిగిన 2023 కోసం మిస్ యూనివర్స్ పోటీలు మూస ధోరణులను బ్రేక్ చేసింది. మిస్ యూనివర్స్ 2023లో తొలిసారిగా ట్రాన్స్‌జెండర్ మహిళలు పాల్గొననున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి జరిగిని పోటీల్లో ‘మొదటిసారి’ ప్లస్ సైజ్ మోడల్ మరియు తల్లులు కూడా మిస్ యూనివర్స్ 2023లో పాల్గొని సందడి చేశాడు.

నేపాల్ ప్రతినిధి జేన్ దీపికా గారెట్ మిస్ యూనివర్స్ 2023లో మొదటి ప్లస్-సైజ్ మహిళగా పోటీలో నిలిచింది. 22 ఏళ్ల జేన్ యువతి అందరినీ ఆకట్టుకుంది. భారీ శరీరంతోనూ అట్రాక్ట్ చేయొచ్చుని నిరూపించింది. ఈమె తనదైన ప్రత్యక స్టైల్‌, స్మైల్ తో అందరినీ ఆకర్షించింది. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా పలువురిని ఆలోచింపచేశాయి. ఇందులో భాగంగా… అందానికి సైజు ముఖ్యమని భావించే వారు ఆ ఆలోచనను మార్చుకోవాలని చెప్పింది.

‘కొన్ని అందాల ప్రమాణాలను పాటించని మహిళగా, మహిళలందరికీ ప్రాతినిధ్యం వహించడానికి నేను ఇక్కడ ఉన్నాను’ అని చెప్పిన ఆమె వ్యాఖ్యలు అక్కడున్నవారిని ఆలోజింపచేసేలా చేశాయి. ఈ పోటీ నవంబర్ 18న జరిగిన పోటీల్లో 90 దేశాల నుండి అందగత్తెలు పాల్గొన్నారు. ఈ పోటీల్లో నేపాల్ యువతి అందర్నీ ఆకట్టుకోవడం విశేషం.

Also Read: BRS Minister: బండి సంజయ్ పై గంగుల కమలాకర్ ఫైర్

  Last Updated: 21 Nov 2023, 01:52 PM IST