Aeroplane Flies Road: రోడ్డుపై పరుగులు పెట్టిన విమానం.. ఫొటో వైరల్!

తరచి చూడాలేకానీ.. మన చుట్టూ విచిత్రమైన ద్రుశ్యాలు కంటపడుతాయి.

Published By: HashtagU Telugu Desk
Plane

Plane

తరచి చూడాలేకానీ.. మన చుట్టూ విచిత్రమైన ద్రుశ్యాలు కంటపడుతాయి. సాధారణంగా ఆకాశంలో మబ్బుల మాటున దూసుకుపోయే విమనాలు రోడ్లపై కనిపిస్తే విచిత్రమే కదా.. అవును ఆకాశంలో ఉండాల్సిన భారీ విమానం.. జాతీయ రహదారిపై పరుగులు పెట్టింది. కొత్త విమానం కాదు.. అది పూర్తిగా కాలం చెల్లిన పాత విమానం. హైదరాబాద్‌లో ఉన్న దాన్ని దిల్లీకి చెందిన ఓ వ్యాపారి రూ.కోటిన్నరకు కొన్నారు. విమాన పైభాగాన్ని ఓ పొడవాటి లారీలో, రెక్కలు, ఇతర భాగాలను మరో వాహనంలో తరలిస్తుండటం వాహనదారులను, చూపరులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆ ఫొటో వైరల్ గా మారింది.

  Last Updated: 24 Sep 2022, 12:21 PM IST