UPSC Mains: వామ్మో ఇవేం ప్రశ్నలు బాబోయ్!

  • Written By:
  • Updated On - January 8, 2022 / 01:09 PM IST

‘నిజం హేతుబద్ధమైనది.. హేతుబద్ధత నిజమైనది’, ‘సాంకేతికత ఆధారిత పరిశోధన అంటే ఏంటి?’, ‘సంసారాన్ని చక్కదిద్దే చేతులే ప్రపంచాన్నీ ఏలుతాయి’.. నిన్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మెయిన్స్ పరీక్షల్లో ప్రశ్నపత్రంలో అడిగిన ఫిలాసఫీ ప్రశ్నలు.

ఇలా ఒకట్రెండు అడిగితే ఫర్వాలేదుగానీ.. ఒకేసారి 8 ప్రశ్నలడిగేసరికి అభ్యర్థుల బుర్ర ఒక్కసారి వేడెక్కింది. ఏ, బీ రెండు సెక్షన్లలో నాలుగు చొప్పున ఫిలాసఫీ ప్రశ్నలను ఇచ్చారు. ఒక్కో సెక్షన్ నుంచి ఒక్క ప్రశ్నకు సమాధానం రాయాలని అడిగారు.

మామూలుగా అయితే గతంలో అంశాలవారీగా ప్రశ్నలు అడిగేవారు. కరెంట్ అఫైర్స్ మీద ప్రశ్నలిచ్చేవారు. ఇప్పుడు వాటి స్థానంలో బుర్రకు పదునెక్కించే తత్వ ప్రశ్నలివ్వడంతో అభ్యర్థులు షాకయ్యారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రస్తుత రాజకీయ, సామాజిక వ్యవహారాలపై ప్రశ్నలు అడుగుతారనుకుంటే.. ఇలా మొత్తం ఫిలాసఫీ ప్రశ్నలడిగేశారేంటో తెలియట్లేదంటూ ట్విట్టర్ వేదికగా చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

చెత్తపేపర్ అంటూ కొందరు అంటుంటే.. ఒకందుకు మంచిదేనని మరికొందరు అంటూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా.. నిపుణులు మాత్రం ఇది మంచి ట్రెండేనని ప్రశంసిస్తున్నారు.