Pet Parrot Popo: ఈ చిలుకను పట్టిస్తే…రూ.5,100…నగరమంతా పోస్టర్లు..!!

చాలా మంది పెంపుడు జంతువులు అంటే ఇష్టపడుతుంటారు.

  • Written By:
  • Publish Date - May 6, 2022 / 04:32 PM IST

చాలా మంది పెంపుడు జంతువులు అంటే ఇష్టపడుతుంటారు. వాటిని ఇంట్లో పెంచుకునేందుకు ఆరాటపడుతుంటారు. ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారు. కుక్కలు, పిల్లులు ఇంకొంత మంది చిలుకలు కూడా పెంచుకుంటారు. అ వికూడా యజమానులపై ఎనలేని ప్రేమను చూపిస్తుంటాయి. తాజాగా బీహార్ రాష్ట్రలోని గయాలో నివసించే ఓ కుటుంబం చిలుకను ఎంతో ప్రేమగా పెంచుకుంటుంది. సొంత బిడ్డలాగా అపురూరంగా చూసుకుంటున్నారు. అయితే కొన్ని రోజుల నుంచి ఆ చిలుక కనిపించకుండా పోయింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు నానా హైరానా పడుతున్నారు. తాము ఎన్నోరకాలుగా ప్రయత్నించినా ఆ చిలుక జాడ కనిపించడంలేదని శ్యామ్ దేవ్ గుప్త దంపతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో చిలుక కనిపించడంలేదంటూ గయాతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో చిలుక పోస్టర్లను అతికించారు. తమ చిలుకను పట్టిస్తే రూ. 5,100బహుమతి ఇస్తామని పోస్టర్లపై వెల్లడించారు. 12సంవత్సరాలుగా తాము చిలుకను పెంచుకుంటున్నామని….దాన్ని ఎవరు తీసుకెళ్లినా తిరిగి ఇచ్చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చిలుక ఆచూకీపై సోషల్ మీడియా ద్వారా కూడా ప్రచారం చేస్తున్నారు. చెట్ల వెంబట తిరుగుతూ…తాము మాట్లాడుకునే భాషలో పిలుస్తున్నా…చిలుక జాడ దొరకడం లేదని కన్నీంటి పర్యంతం అవుతున్నారు.