Medical Insurance : ఆరోగ్య భీమా ఏ వయసులో తీసుకోవాలి.. పూర్తి వివరాలు!

ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య బీమా అన్నది చాలా అవసరం. ఈ ఆరోగ్య బీమా వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మనందరికీ తెలిసిందే.

  • Written By:
  • Publish Date - June 26, 2022 / 01:00 PM IST

ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య బీమా అన్నది చాలా అవసరం. ఈ ఆరోగ్య బీమా వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మనందరికీ తెలిసిందే. ఈ కరోనా విపత్కర పరిస్థితులలో హాస్పత్రి లో చేరితే రోజుకు దాదాపుగా లక్షలకు పైగానే ప్రాణం కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అంత డబ్బులు కట్టినా కూడా మన ప్రాణాలు మనకు తిరిగి దక్కుతాయి అన్న నమ్మకం లేదు. ఈ క్రమంలోనే అంత డబ్బు కత్తి స్తోమత లేని వారు చికిత్సను తీసుకోలేకపోయారు. ఆరోగ్య బీమా కట్టిన వారు చాలావరకూ గట్టెక్కారు. ఇక ఈ ఆర్థిక బీమా కట్టని వారి పరిస్థితి మరీ దారుణం అని చెప్పవచ్చు.

ఈ ఆరోగ్య భీమాను కట్టడం వల్ల ఎప్పుడు ఏ రూపంలో అవసరం వస్తుందో ఎవరు చెప్పలేరు. ఇకపోతే ఈ ఆరోగ్య బీమా ఏ వయసు వారు కట్టాలి అన్న విషయానికి వస్తే.. చాలామంది తాము ఆరోగ్యంగానే ఉన్నామని తమకు ఇంకా వృద్ధాప్యం రాలేదని ఆరోగ్య సమస్యలు కూడా లేవు అని ఆరోగ్య బీమా ను తీసుకునేందుకు మొగ్గు చూపించరు. ప్రతి ఒక్కరు కూడా ఇలా అనుకుని చాలా తప్పు చేస్తున్నారు. ఇలా అనుకొని ఆలస్యంగా భీమాను కట్టడంవల్ల వయసు మీరిన తర్వాత ఆరోగ్య బీమాకు అధిక ప్రీమియం చెల్లించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఖచ్చితమైన సమయం యుక్తవయస్సు.

అర్జున ఆరంభించిన వెంటనే తీసుకోవాలి మరీ ముఖ్యంగా చెప్పాలి అంతే 20 నుంచి 25 ఏళ్ళ మధ్య ఆరోగ్య బీమాను తీసుకోవాలి. చిన్న వయసులోనే ఆరోగ్య బీమా ను తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా పూర్తి రక్షణ కల్పించు కున్నట్లు అవుతుంది. అంతేకాకుండా ప్రీమియం కూడా తక్కువగా ఉంటుంది. బీమా సంస్థలు పాలసీదారు నీ వయసు తో పాటుగా అతడికి లేదా ఆమెకు అప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? ఎంత మొత్తానికి బీమా తీసుకుంటున్నారు? తదితర అంశాల ఆధారంగా ప్రీమియంను నిర్ణయిస్తారు. చిన్న వయసులోనే 99% మందికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు బయటపడవు. అందువల్ల చిన్న వయసులోనే ఆరోగ్య బీమా ను తీసుకోవాలి దానివల్ల ప్రీమియం తక్కువగా వస్తుంది.